యాప్‌రే యాప్!
మొబైల్ఫోన్ల వాడకం మారిపోయింది. కాల్, మెసేజ్‌లకే కాదు.. సమస్త పనులకు ఇదే ఆధారమైపోయింది. విజ్ఞానానికైనా, వినోదానికైనా అన్నింటికీ ఇదే. ఫొటోలు తీయాలన్నా, సినిమాలు చూడాలన్నా, సంగీతం వినాలన్నా, డబ్బులు పంపించాలన్నా.. ముందుగా ఫోన్ మీద చేయి పడాల్సిందే.
మొబైల్ఫోన్ల వాడకం మారిపోయింది. కాల్, మెసేజ్‌లకే కాదు.. సమస్త పనులకు ఇదే ఆధారమైపోయింది. విజ్ఞానానికైనా, వినోదానికైనా అన్నింటికీ ఇదే. ఫొటోలు తీయాలన్నా, సినిమాలు చూడాలన్నా, సంగీతం వినాలన్నా, డబ్బులు పంపించాలన్నా.. ముందుగా ఫోన్ మీద చేయి పడాల్సిందే. వినూత్న యాప్‌ల ఆవిష్కరణతో రోజురోజుకీ ఫోన్ సరికొత్త సొబగులు సంతరించుకుంటోంది మరి. గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షలాది యాప్‌లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా కొత్తగానూ మార్చేస్తాయి. కొన్ని ఇతర పరికరాలతో అనుసంధానం చేస్తే.. మరికొన్ని మన పనులను ఆటోమేట్ చేసేస్తాయి. కొన్ని యాప్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మంచి ఫీచర్లను తేలికగా, సమర్థంగా వాడుకునేలా చేస్తాయి. అలాంటి యాప్‌ల్లో కొన్ని ఇవీ..
లింకెట్ బ్రౌజర్
వెబ్ ప్రపంచంలో ఆసక్తికరమైన కథనాలను అన్వేషించటానికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కాకపోతే వాటిని అక్కడే చదువుకోవటం కుదరదు. వీటిని గుర్తుంచుకొని తర్వాత చదవటం కాస్త కష్టమైన పనే. ఇక్కడే లింకెట్ బ్రౌజర్ చేదోడుగా నిలుస్తుంది. ఇంతకుముందు దీన్ని క్రోమర్ అని పిలుచుకునేవారు. ఇది ప్రస్తుతం వాడుతున్న డిఫాల్ట్ బ్రౌజర్‌తో జతకట్టి పనిచేస్తుంది. నేపథ్యంలో వెబ్ పేజీలు కనిపించేలా చేయటం దీని ప్రత్యేకత. తెర మీద బబుల్స్ మాదిరిగా తేలియాడే పేజీల లింకులను ట్యాప్ చేసి ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. క్లిక్ చేసిన లింకులను ఏఎంపీ వర్షన్లో లోడ్ చేయటం వల్ల వేగం కూడా పెరుగుతుంది. వెబ్ పేజీలను ఆర్టికల్ మోడ్‌లోనూ చూసుకోవచ్చు.
పాపప్ విడ్జెట్ 3
మంచి ఆండ్రాయిడ్ విడ్జెట్లు నిజంగానే ఎంతగానో పనికొస్తాయి. కానీ ఎక్కువ విడ్జెట్లను వాడితే అవన్నీ హోం స్క్రీన్ మీద చిందరవందరగా కనిపిస్తాయి. ఫోన్ వేగమూ నెమ్మదిస్తుంది. పాప్ విడ్జెట్ 3 యాప్‌తో ఇలాంటి చిక్కులను తప్పించుకోవచ్చు. ఇది మనం ఎంచుకున్న విడ్జెట్లన్నింటినీ హోం స్క్రీన్ మీద చిన్న ఐకాన్లుగా మార్చేస్తుంది. వీటి మీద ట్యాప్ చేసినప్పుడు అది పైకి తేలి వచ్చి ఓపెన్ అవుతుంది. అందులో ఏముందో చూసుకోవటానికి వీలుంటుంది. ఇలా విడ్జెట్లను మరింత సౌకర్యంగా, వేగంగా వాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- యాప్‌ను పూర్తిగా లాంచ్ చేయకుండానే తాజా ట్వీట్లను చూసుకోవచ్చు. దీంతో బ్యాటరీ సేవ్ అవుతుంది కూడా.
నోట్‌పిన్
దీని పనితీరును చూస్తే ఇంకా ఇది ఆండ్రాయిడ్‌లో ఎందుకు భాగం కాలేదోనని అనిపించటం ఖాయం. ఇది నోట్స్‌ను సృష్టించుకోవటానికే కాదు, వాటిని నోటిఫికేషన్స్ ప్యానల్‌కు పిన్ చేసుకోవటానికీ వీలు కల్పిస్తుంది. ఒకసారి పిన్ చేయగానే వాటిని తొలగించేంతవరకు నోటిఫికేషన్ ప్యానల్లోనే కనిపిస్తాయి. ఇలా ఇవి రిమైండర్లుగానూ ఉపయోగపడతాయన్నమాట. ఫోన్‌ను అన్‌లాక్ చేసిన ప్రతిసారీ ఆయా విషయాలను గుర్తుచేస్తాయి. నోట్పిన్ను ఉపయోగించుకోవటం తేలిక. ప్రాధాన్యాలను బట్టి నోట్స్‌ను వర్గీకరించుకోవచ్చు. ఇటీవల ముందుగా యాడ్ చేసినవీ, తర్వాత యాడ్ చేసినవి వేర్వేరుగా కనిపిస్తాయి. ఇవన్నీ వివిధ రంగుల్లోనూ దర్శనమిస్తాయి.
మాక్రోడ్రాయిడ్
ఇది ఆయా పనులను మనం నిర్ణయించుకున్నట్టుగా ఆటోమేటిక్‌గా చేసి పెట్టే యాప్. ఇందులో ట్రిగ్గర్, యాక్షన్, కాన్స్ట్రెయింట్స్ అని మూడు భాగాలుంటాయి. ట్రిగ్గర్ ద్వారా మనకు అవసరమైన పనులను జోడించుకోవాలి. అది ఎలా పనిచేయాలో యాక్షన్‌లో నిర్ణయించుకోవాలి. ఇక కాన్స్ట్రెయింట్స్లో అది ఎప్పుడెలా జరగాలో ఎంచుకోవాలి. దీంతో అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఉదాహరణకు- క్రోమ్ యాప్‌ను ట్రిగ్గర్‌లో జోడించారనుకోండి. క్రోమ్‌ను ఓపెన్ చేసినప్పుడు హోంపేజీగా గూగుల్ ఓపెన్ కావాలని ఎంచుకున్నారు. పోన్ వైఫైతో కనెక్ట్ అయినప్పుడే క్రోమ్ ఓపెన్ కావాలని కాన్స్ట్రెయింట్స్లో నిర్ణయించుకున్నారు. అప్పుడు క్రోమ్‌ను తెరచిన ప్రతీసారీ గూగుల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ వైఫై ఆఫ్ చేసి, మొబైల్ డేటాను ఆన్ చేశారనుకోండి. అప్పుడు హోంపేజీగా గూగుల్ ఓపెన్ కాదు. రాత్రిపూట ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచటం, కారులో ఉన్నప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లను పైకి చదివి వినిపించటం.. ఇలాంటి రకరకాల పనులను దీనికి అప్పజెప్పొచ్చు.
యూనివర్సల్ కాపీ
ఆండ్రాయిడ్ ఫోన్లలో కాపీ, పేస్ట్ చేయటం మామూలే. కాకపోతే కొన్ని యాప్స్ దీన్ని సపోర్టు చేయవు. కొన్ని వెబ్సైట్లు కాపీ చేసుకోవటానికి అనుమతించవు. ఇక్కడే యూనివర్సల్ కాపీ ఉపయోగపడుతుంది. దీంతో ఎలాంటి యాప్ నుంచైనా దేన్నయినా కాపీ చేసుకోవచ్చు. ఇమేజ్ నుంచీ టెక్స్ట్‌ను కాపీ చేసుకోవచ్చు. ఇది పరికరంతో ఇట్టే కలిసిపోయి పనిచేస్తుంది. అవసరమైన పర్మిషన్లు ఇస్తే చాలు. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక నోటిఫికేషన్ బార్‌లోని లింక్ సాయంతో ఓపెన్ చేసుకోవాలి. టెక్స్ట్ మీద వేలితో కాసేపు అలాగే నొక్కి ఉంచితే కాపీ అవుతుంది. ఇమేజ్‌లోని టెక్స్ట్‌ను కాపీ చేయాలనుకుంటే స్కానింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి మరి.
సిసేమ్
ఆండ్రాయిడ్‌లో దేన్నయినా వెతికిపెట్టే యాప్ ఇది. ఫోన్‌ను ఉపయోగించే తీరును ఇది గ్రహిస్తుంది. వందలాది షార్ట్‌కట్స్‌ను సృష్టిస్తుంది. ఇతర యాప్‌లకు అందే మెసేజ్‌లను చూపిస్తుంది. ఉదాహరణకు స్లాక్ లేదా ప్లేలిస్టుల మెసేజ్‌లను నేరుగా హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం చేస్తుంది. ఆయా ప్రోగ్రామ్లలోని ప్రత్యేక ఫీచర్లకు షార్ట్‌కట్స్‌ను సృష్టించటం ద్వారా పనులు త్వరగా ముగించుకోవచ్చు. ఒక్క ట్యాప్‌తోనే క్రికెట్ మ్యాచ్ స్కోరును చూసుకోవటం వంటి పనులెన్నో చేసుకోవచ్చు.
నోవాలాంచర్
ఆండ్రాయిడ్ ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవటానికి ఉపయోగపడే లాంచర్ ఇది. చిన్నదే అయినా వేగంగా, స్థిరంగా పనిచేస్తుంది. దీంతో ఓపిక ఉన్నంతవరకు రకరకాలుగా ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. సెటింగ్స్‌ను యాక్టివేట్ చేయటం దగ్గర్నుంచి యాప్స్‌ను లాంచ్ చేయటానికి ఇంటర్స్పేస్ను నావిగేట్ చేయటం వరకూ రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. చాలావరకు దీని డిఫాల్ట్ సెటింగ్సే సరిపోతాయి. కావాలంటే ఎలాంటి విడ్జెట్నైనా రీసైజ్ చేసే పెట్టే ఫీచర్ల వంటి వాటినీ అదనంగా వాడుకోవచ్చు.
వైట్ నాయిస్ లైట్
ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎవరికైనా హాయిగానే ఉంటుంది. ఆ చప్పుళ్లు మనసుకు ఎంతో హాయినిస్తాయి. కంటి నిండా నిద్ర పట్టేలా చేస్తాయి. అలాంటి అనుభూతితోనే నిద్ర బాగా పట్టేలా, విశ్రాంతి కలిగించేలా చేసేదే వైట్ నాయిస్ లైట్ యాప్. సముద్ర తీరాన అలలు, పారే యేరు, మంద్రంగా వీచే గాలి.. ఇలాంటి సున్నితమైన శబ్దాలను వినిపించటం దీని ప్రత్యేకత. మనం నిద్రపోయినా మెదడు చుట్టుపక్కల శబ్దాలను వింటూనే ఉంటుంది. రాత్రిపూట కుక్కల అరుపు, బైకుల చప్పుళ్ల వంటివి నిద్రకు భంగం కలిగించొచ్చు. వైట్ నాయిస్ లైట్ ఇలాంటి అనవసర శబ్దాలు వినిపించకుండా చేస్తుంది. దీంతో గాఢ నిద్ర పట్టేలా చూస్తుంది. యీప్తో కొత్త శబ్దాలను రికార్డు చేసుకోవచ్చు. లూప్ చేసుకోవచ్చు. వీటిని ఇతరులతో పంచుకోవచ్చు కూడా.
మైటీటెక్స్ట్
ఎస్ఎంఎస్లను కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో చూసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మైటీటెక్స్ట్ యాప్‌ను వాడి చూడండి. ఇది బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ద్వారా పీసీ, మ్యాక్ లేదా లైనక్స్ కంప్యూటర్‌కు సింక్ అవుతుంది. ఇలా ఎస్ఎంఎస్లను పెద్ద తెర మీద చూసుకోవటానికి వీలు కల్పిస్తుంది. దీంతో మెసేజ్‌లను చూసుకోవటమే కాదు.. రిప్లై కూడా ఇవ్వచ్చు. కొత్త మెసేజ్‌లనూ రాసుకోవచ్చు. ఇతర యాప్‌లకు అందే నోటిఫికేషన్లనూ చూసుకోవచ్చు. కావాలంటే కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా మెసేజ్‌లను పంపుకోవటానికి ఉచిత వర్షన్లో నెలకు కొంత పరిమితి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్‌తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్