ట్రూకాలర్‌ కాల్‌ రికార్డింగ్‌ అందరికీ

ట్రూకాలర్‌ యాప్‌ ద్వారా మనకు ఎవరు ఫోన్‌ చేస్తున్నారో ఇట్టే తెలుసుకుంటాం. కానీ దీంతో కాల్‌ రికార్డింగ్‌ కూడా చేసుకోవచ్చని తెలుసా? ఒకప్పుడిది డబ్బు చెల్లించినవారికే అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది.

Updated : 17 Nov 2021 16:20 IST

ట్రూకాలర్‌ యాప్‌ ద్వారా మనకు ఎవరు ఫోన్‌ చేస్తున్నారో ఇట్టే తెలుసుకుంటాం. కానీ దీంతో కాల్‌ రికార్డింగ్‌ కూడా చేసుకోవచ్చని తెలుసా? ఒకప్పుడిది డబ్బు చెల్లించినవారికే అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడేవారికి.. అదీ ఆండ్రాయిడ్‌ 5.1 లేదా అంతకన్నా ఎక్కువ మోడల్‌ స్మార్ట్‌ఫోన్లలోనే వాడుకోవటానికి వీలుంటుంది. దీని ద్వారా అవుట్‌గోయింగ్‌, ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అన్నీ రికార్డు చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఆపేసుకోవచ్చు. అయితే హెడ్‌ఫోన్స్‌ ఉపయోగిస్తున్నప్పుడు కాల్‌ రికార్డు కాదు. తమ కాల్‌ను రికార్డు చేస్తున్నట్టు అవతలి వారికి తెలిసే అవకాశం లేదు. రికార్డయిన కాల్స్‌ ఆఫ్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయి. సెటింగ్స్‌ ద్వారా స్టోరేజీలోకి వెళ్లి.. మ్యూజిక్‌ అండ్‌ ఆడియో ఫైల్స్‌లో వీటిని వెతుక్కోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు