Published : 03/10/2021 01:17 IST

iPhone: ₹49,999కే ఐఫోన్‌ 12.. యాపిల్‌ ఫోన్లపై గొప్ప డీల్స్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ఇ-కామర్స్‌ కంపెనీలు ఆఫర్ల పండగకు తెరతీశాయి. ఏటా మాదిరిగానే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీగా మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్‌ 3 నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’, ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో సేల్‌ను ప్రారంభించనున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ల గురించి. ఐఫోన్‌ 12ను ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుండగా.. ఐఫోన్‌ 11, ఎక్స్‌ఆర్‌పై అమెజాన్‌ కూడా డిస్కౌంట్‌ అందిస్తోంది.

యాపిల్‌ ఐఫోన్‌ 12.. 64 జీబీ వేరియంట్‌ ₹49,999కే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో లభ్యమవుతోంది. వాస్తవానికి దీని అసలు ధర ₹65,990. తగ్గింపు ధరే కాకుండా ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుదారులు 10 శాతం అదనంగా డిస్కౌంట్‌ అందుకోవచ్చు. పాత ఫోన్‌ను కూడా ఎక్స్ఛేంజ్‌ చేసి ₹15,800 వరకు పొందొచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారో వారు ఈ డీల్‌పై ఓ లుక్కేయొచ్చు. ఐఫోన్‌ 13కి, ఐఫోన్‌ 12కి పెద్ద తేడా లేకపోవడం ఇందుక్కారణం. అదే ఐఫోన్‌ 13 కొనాలంటే ₹79 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమెజాన్‌లో ఐఫోన్‌ 11.. ₹38,999కే లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుదారులు 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. వాస్తవంగా ఐఫోన్‌ 11 ధర రూ.49,999. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ వాస్తవ ధర ₹38వేలు కాగా.. సేల్‌ సందర్భంగా ₹32,999కే అమెజాన్‌ విక్రయిస్తోంది. యాపిల్‌ ఫోన్లను కొనాలన్న కోరిక ఉన్న వారు ఈ డీల్స్‌ను పరిశీలించొచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని