Updated : 26/10/2020 13:46 IST

ఫాలో.. ఫాలో యూత్! ఇన్‌స్టాలో.. ఇవి మీ కోసమే! 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఇప్పడు యూత్‌లో యమా క్రేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌. అరగంటకో పోస్ట్‌, గంటకో స్టోరీతో యువతీయువకులు ఇందులో సందడి చేస్తున్నారు. పోస్ట్‌లూ, స్టోరీలూ, ఫ్రెండ్‌ ఫొటోకో లైక్‌, నచ్చిన సెలబ్రెటీకో కామెంట్‌.. ఇవేకాదు, ఇన్‌స్టాలో సంగతులు. విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అవగాహన కలిగించే ప్రొఫైల్‌లను చూడొచ్చు. మీకు ఇన్‌స్టా ఎకౌంట్‌ ఉంటే ఓసారి అలాంటి వాటిని వెతకండి. నచ్చితే ఫాలో అవండి.  

స్ఫూర్తి, అవగాహన
   ఓ 16ఏళ్ల అమ్మాయి ఏం చేస్తుంటుంది? అంటే మీరేం చెప్తారు? ఏముంది, కాలేజీకి వెళ్తుంది. స్నేహితులతో సరదాగా సందడి చేస్తుంటుంది అంటారు. అంతేగా! కానీ మీరెప్పుడైనా ఊహించారా ఓ 16ఏళ్ల అమ్మాయి ప్రపంచస్థాయిలో మార్పుతేగలదని! అవును కాలేజీ వెళ్లి చదువుకుంటూ సరదాగా గడిపే దశలో పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమబాట పట్టింది స్వీడన్‌కి చెందిన gretathunberg. దేశవిదేశాల్లో తనలాంటి పర్యావరణ ఔత్సాహికులను కలుపుకొంటూ వాతావరణం, పర్యావరణ పరిరక్షణపై అనేక సందేశాలిస్తోంది. ప్రకృతి మనకెంతో ఇచ్చింది. కొంతైనా తిరిగివ్వాలంటూ ప్రజల్లో అవగాహన కల్గిస్తోంది. తన ఈ ప్రయాణంలోని చిత్రాలు, వీడియోలు ఇన్‌స్టాలో ఉంచుతూ నేటి తరానికి స్ఫూర్తినిస్తూ పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తోంది.
ఇన్‌స్టా:   @gretathunberg. 


 జీవిత పాఠాల కోసం
జీవితమన్నాక ఎత్తుపల్లాలు సహజం. సమాజాన్ని నిశితంగా గమనిస్తే వాటి లోతుపాతులు అర్థమవుతాయి. వాటిని అధిగమించగలమన్న నమ్మకం కలుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. సమస్యను ఎదిరించి పోరాడే వారు కొందరైతే, వెనుదిరిగే వారు మరికొందరు. మరి వారి అనుభవాలనూ, అనుభవ పాఠాలనూ తెలుసుకోవాలని మీకుంటే  humansofnewyorkనిఫాలో అవొచ్చు. వాటి నుంచి ప్రేరణ పొందొచ్చు. కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ ఇలా జీవితంలోని ప్రతి అంశాన్నీ ఆస్వాదించేలా చక్కని కథలు చదవొచ్చు. ఫొటోగ్రాఫర్‌ బ్రాండన్‌ న్యూయార్క్‌ వీధుల్లో తిరిగి, అక్కడి ప్రజలతో మాట్లాడి, వారి అనుభవాలు తెలుసుకుని, ఇన్‌స్టా వేదికగా ఇలా ఉంచుతున్నారు. అదే, మన దేశ ప్రజల జీవితానుభవాలు తెలుసుకోవాలంటే ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ ముంబై’, ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్’‌.. ఇలా ప్రాంతాల వారీగా ఎకౌంట్‌లు ఇన్‌స్టాలో ఉన్నాయి. 
 ఇన్‌స్టా: Humans of Bombay 

కాస్త ప్రేరణ అవసరమైతే...
    ఎన్నో కలలు కన్న యువతరానికి కరోనాతో ఊహించని సమస్యలు. ఉద్యోగాలు కోల్పోయి కొందరు. అప్పుడే ప్రారంభించిన స్టార్టప్‌లలో అనుకోని అవాంతరాలతో మరికొందరు. ఏం చేయాలో పాలుపోని స్థితి. ఇలా నిరుత్సాహపడే యువత కాస్త ఉత్సాహాన్నీ, ప్రేరణనీ పొందాలనుకుంటే age_of_attitudeని ఫాలో అవొచ్చు. ఇందులోని స్ఫూర్తిదాయక కొటేషన్లు ఆలోచింపజేస్తాయి. వాళ్లపై వాళ్లకి నమ్మకాన్ని కలిగిస్తాయి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకుండా జీవితంలో ముందుకుసాగేలా ప్రేరణనిస్తాయి. 
ఇన్‌స్టా: age_of_attitude

 

కేవలం మంచే..
@goodhq. ఇదో న్యూస్‌ హోమ్‌. రోజూవారీగా ప్రపంచంలో జరుగుతున్న వార్తా విశేషాలు తెలుసుకోవచ్చు. వార్తలంటే ఎప్పుడూ వినేవి కాదండోయ్. పేరుకు తగ్గట్టే కేవలం శుభ వార్తలే చెబుతుంది. ‌ప్రపంచంలో రోజూ జరిగే మంచి విషయాలూ, స్ఫూర్తినిచ్చే వార్తలూ తెలుపుతుంది. ఆ వార్త గురించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే అదనపు లింక్‌లనూ అందిస్తుంది. మనసుకు ప్రశాంతతనిచ్చే విషయాలూ, శాస్ర్తీయ అధ్యయనాలు, రాజకీయ విశేషాలూ, మన చుట్టూ ఉన్నవారు తమ సమస్యలనెలా అధిరోహించారు వంటి సానుకూల వార్తలను ఇక్కడ చదవొచ్చు. 

ఇన్‌స్టా:  @goodhq

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని