Smartphone Unlock: ప్యాట్రన్, లాక్ మరచిపోతే... అన్‌లాక్ ఇలా!
సాంకేతికత అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు మనుషులకు నమ్మకమైనవిగా మారిపోయాయి. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు ఎంతో ముఖ్యమైన డేటాను ఫోన్లో భద్రపరుస్తున్నాం. అందుకే ఇతరులెవరూ ఫోన్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా వివిధ రకాల లాకింగ్ సిస్టమ్స్‌తో రక్షణ కల్పిస్తుంటాం.
ఇంటర్నెట్‌డెస్క్: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు మనుషులకు నమ్మకమైనవిగా మారిపోయాయి. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు ఎంతో ముఖ్యమైన డేటాను ఫోన్లో భద్రపరుస్తున్నాం. అందుకే ఇతరులెవరూ ఫోన్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా వివిధ రకాల లాకింగ్ సిస్టమ్స్‌తో రక్షణ కల్పిస్తుంటాం. అయితే ఈ లాక్ ప్యాట్రన్లు మరచిపోయినా, పొరపాటున లాకింగ్ సిస్టం బ్లాక్ అయినా దాన్ని ఓపెన్ చేయడం సులువుగా అయ్యేపని కాదు. కానీ ఫోన్‌ను ఉపయోగించాలంటే దాన్ని అన్‌లాక్ చేయాల్సిందే. ఫోన్ లాక్ అయినప్పుడు ఏం చేయాలి?దాన్ని ఎలా అన్‌లాక్ చేయాలో చూద్దాం.
ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ (ఏడీఎం)
ఈ పద్ధతిలో ఫోన్ అన్‌లాక్ అయ్యేందుకు ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ‘ఫైండ్ మై డివైజ్’ అనే ఫీచర్‌ను ఎనేబుల్ చేసివుండాలి. అలానే ఈ ప్రక్రియ ద్వారా ఫోన్‌ని అన్‌లాక్ చేస్తే అందులోని డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి ఫైండ్ మై డివైజ్ వెబ్సైట్లోకి వెళ్లాలి. అలానే మీ కంప్యూటర్లో కూడా ఫోన్లో లాగిన్ అయిన గూగుల్ ఖాతాతో లాగిన్ కావాలి. తర్వాత ఫైండ్ మై డివైజ్ వెబ్సైట్లో మీ ఫోన్ లొకేషన్‌తో పాటు ఎరేజ్ డివైజ్ అనే అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎరేజ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసుకుని రీస్టార్ట్ అవుతుంది. అలా మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయొచ్చు.
గూగుల్ ఖాతాతో ఎలాగంటే?
మీ ఫోన్ లాక్ ప్యాట్రన్ మరచిపోతే ఐదుసార్లు తప్పుగా ప్యాట్రన్‌ను ప్రయత్నించాలి. తర్వాత ఫర్గాట్ ప్యాట్రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ గూగుల్ ఖాతాలో లాగిన్ చేయమని సూచిస్తుంది. మీ గూగుల్ ఖాతా వివరాలు టైప్ చేసిన తర్వాత మీకు ఫోన్ లాక్ పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మీ ఫోన్‌కి కొత్త లాక్ ప్యాట్రన్ పెట్టుకుంటే సరిపోతుంది.
డ్రాయిడ్‌కిట్ (Droidkit) సాయం తీసుకోండి..
పై రెండు పద్ధతులే కాకుండా ఐమొబే డ్రాయిడ్‌కిట్ ద్వారా కూడా అన్‌లాక్ చేయవచ్చు. ఈ సాఫ్ట్వేర్ టూల్ సాయంతో ఫోన్‌ని అన్‌లాక్ చేయడం ఎంతో సులభం. ఇది అన్ని రకాల ఆండ్రాయిడ్ స్క్రీన్ లాక్స్, పిన్లు, పాస్వర్డ్లు, లాక్ ప్యాట్రన్లు, ఫింగర్‌ప్రింట్ ఐడీ, ఫేస్ రికగ్నిషన్లను తొలగించేందుకు సాయపడుతుంది. అలానే 20 వేలకు పైగా ఆండ్రాయిడ్ మోడల్స్‌ని ఈ టూల్ సపోర్ట్ చేస్తుంది. ఫైండ్ మై డివైజ్ తరహాలోనే ఈ పద్ధతిలో కూడా ఫోన్లోని డేటా మొత్తం డిలీట్ అవుతుంది.
* ముందుగా మీ ఫోన్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. తర్వాత గూగుల్‌లో డ్రాయిడ్‌కిట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోమని సూచిస్తుంది.
* సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో రన్ చేశాక.. విండోలో కుడివైపు అన్‌లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది.
* అందులో స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కాన్ఫిగరేషన్ ఫైల్స్ పేజ్‌లో రిమూవ్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఫోన్ కంపెనీల జాబితా చూపిస్తుంది.
* మీ ఫోన్ కంపెనీని సెలెక్ట్ చేసి నెక్ట్స్ క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్ మీద కనిపించే సూచనలను జాగ్రత్తగా అనుసరిస్తే కొద్దిసేపటి తర్వాత మీ ఫోన్ స్క్రీన్ అన్‌లాక్ అవుతుంది.
ఫోన్ అన్‌లాక్‌తోపాటు ఈ సాఫ్ట్వేర్ మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లనూ అందిస్తుంది. డేటా రికవరీ, శాంసంగ్ ఎఫ్ఆర్పీ లాక్, ఆప్టిమైజింగ్ సిస్టం ఫర్ బెటర్ ఫెర్ఫామెన్స్ వంటి ఫీచర్లు డ్రాయిడ్కిట్లో ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ మ్యాక్, విండోస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇది ఉచితం కాదు. దీనికోసం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. వేర్వేరు ప్లాన్లు అందుబాటులోఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్‌ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!