Android Powerful Processor: పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్‌తో రానున్న స్మార్ట్ఫోన్లు ఇవే!
క్వాల్‌కోమ్ కంపెనీ కొత్తగా స్నాప్‌డ్రాగన్ సిరీస్‌లో కొత్త ప్రాసెసర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ ప్రాసెసర్లలోనే దీన్ని అత్యంత పవర్ఫుల్ ప్రాసెసర్ అని క్వాల్‌కోమ్ చెబుతోంది. మరి ఈ ప్రాసెసర్‌తో ఏయే ఫోన్ మోడల్స్ రానున్నాయనేది చూద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో క్వాల్‌కోమ్ (Qualcomm) ప్రాసెసర్లేని ఫోన్లు చాలా అరుదు. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలు క్వాల్‌కోమ్ ప్రాసెసర్లనే ఉపయోగిస్తుంటాయి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగానే క్వాల్‌కోమ్ సమర్థవంతమైన కొత్త ప్రాసెసర్లను ఎప్పటికప్పుడు తయారుచేస్తుంది. తాజాగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 (Snapdragon 8 Gen 1) పేరుతో స్నాప్‌డ్రాగన్ (Snapdragon) 8 సిరీస్‌లో ఈ కొత్త ప్రాసెసర్‌ను పరిచయం చేసింది. దీన్ని ఆండ్రాయిడ్ ప్రాసెసర్లలోనే పవర్ఫుల్ ప్రాసెసర్‌గా టెక్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం మొబైల్ టెక్నాలజీతో గత ప్రాసెసర్ల కన్నా మెరుగైన ఫీచర్స్ ఇందులో ఉంటాయని క్వాల్‌కోమ్ వెల్లడించింది.
ఈ ప్రాసెసర్ సాయంతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలో కటింగ్ ఎడ్జ్ 5జీ (5G), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గేమింగ్ , కెమెరా, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, సౌండ్, భద్రత వంటి ఫీచర్స్ యూజర్స్‌కు మరింత మెరుగైన సేవలను అందిస్తాయని క్వాల్‌కోమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ కటౌజియాన్ తెలిపారు. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. మరి పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రానున్న మొబైల్ జాబితాపై ఓ లుక్కేద్దామా..
షావోమి 12 (Xiaomi 12)
షావోమి కొత్తగా 12 సిరీస్‌లో ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. క్వాల్‌కోమ్ టెక్ సమ్మిత్లోనే ఈ విషయాన్ని షావోమి ప్రకటించింది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం షావోమి 12 అల్ట్రా పేరుతో ఈ ఫోన్ తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేయనుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్4 (Oppo Find X4)
ఒప్పో కూడా త్వరలో విడుదల చేయనున్న కొత్త మోడల్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. గతంలో విడుదలైన ఒప్పో ఫైండ్ ఎక్స్3 ప్రో మోడల్‌కు కొనసాగింపుగా ఒప్పో ఫైండ్ ఎక్స్4 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఇందులో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 2K రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల శాంసంగ్ ఈ4 అమోలెడ్ ఎల్టీపీఓ డిస్ప్లే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో మొత్తం నాలుగు కెమెరాలుంటాయని సమాచారం. వెనుకవైపు రెండు 50 ఎంపీ కెమెరాలతోపాటు 13 ఎంపీ కెమెరా ఉంటుందట. ముందుభాగంలో క్యాట్-ఐలెన్స్తో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చినట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సివుంది.
రియల్మీ జీటీ2 ప్రో (Realme GT2 Pro)
రియల్మీ జీటీ 2 ప్రో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో విడుదలకానుంది. ప్రీమియం శ్రేణిలో రానున్న తొలి జీటీ సిరీస్ ఫోన్ ఇదేనని టెక్ వర్గాలు తెలిపాయి. దీని ధర సుమారు రూ. 60 వేల వరకు ఉంటుందని అంచనా. షావోమి 11 అల్ట్రా మోడల్ తరహాలోనే జీటీ2 ప్రోలో కూడా వెనుకవైపు కెమెరా కోసం ప్రత్యేక కన్సోల్ ఇస్తున్నారట. వెనుకవైపు మూడు కెమెరాలలో రెండు 50 ఎంపీ కెమెరాలని సమాచారం. అలానే ఈ ఫోన్ 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట.
మోటో ఎడ్జ్ ఎక్స్30 (Moto Edge X30)
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో రానున్న మరో ఫోన్ మోటో ఎడ్జ్ ఎక్స్30. ఈ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో లేదా జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్నారట. ఇందులో 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉటుందని తెలుస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ మూడు కెమెరాలు, ముందుభాగంలో సెల్ఫీల కోసం 60 ఎంపీ కెమెరా ఉంటుందని సమాచారం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట.
వన్‌ప్లస్ 10 సిరీస్ (OnePlus 10 Series)
వన్‌ప్లస్ కూడా 10 సిరీస్‌లో వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రో రెండు కొత్త ఫోన్లను తీసుకురానుంది. ఈ ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. వీటిలో 10 ప్రోలో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సిర్కా డిస్ప్లే ఇస్తున్నారట. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, ఇది 125 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్