అంగారకుడితో ఫొటో దిగారా..?

నాసా ప్రజలకు అంగారకుడిపై సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అదేంటి.. ఎలా సాధ్యం?అనే కదా మీ సందేహం.. మరింకెందుకు ఆలస్యం.. ఎలానో తెలుసుకోండి.

Published : 18 Jun 2021 23:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భూమి తర్వాత మనిషి మనుగడకు అంగారక గ్రహం అనువైనదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే దానికి సంబంధించిన పరిశోధనలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అందుకే దాని గురించి ఎలాంటి సమాచారం తెలుకునేందుకైనా ఆసక్తి కనబరుస్తుంటాం. కొద్ది నెలల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అంగారకుడిపై పరిశోధనల కోసం పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ సురక్షితంగా గ్రహంపైకి చేరుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని నాసా ప్రజలకు అంగారకుడిపై సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అదేంటి.. ఎలా సాధ్యం?అనే కదా మీ సందేహం.. మరింకెందుకు ఆలస్యం.. ఎలానో తెలుసుకోండి.

మార్స్‌ పర్సెవరెన్స్‌ ఫొటో బూత్‌

ఇందుకోసం నాసా అంగారకుడికి సంబంధించిన ఎనిమిది బ్యాక్‌గ్రౌండ్‌ ఫొటోలతో కొన్ని డమ్మీ ఇమేజ్‌లను డిజైన్‌ చేసింది. అందులో మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకుని మన ఫొటోను అప్‌లోడ్ చేస్తే చాలు.. మార్స్‌లో ఉన్నట్లు, పర్సెవరెన్స్‌ రోవర్‌ పక్కనే నుంచుని సెల్ఫీ దిగినట్లు, మార్స్‌ మిషన్‌ గదిలో ఉన్నట్లుగా ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాము సాధించిన విజయంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాసా అధికారి మార్క్‌ ఎట్‌కిండ్‌ తెలిపారు. ఇదే కాకుండా ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రాంలో.. మిషన్‌ కంట్రోల్‌ హెడ్‌సెట్, త్రీడీ మార్స్‌ రోవర్‌ ఏఆర్‌ ఫిల్టర్స్‌ను తయారుగా ఉంచింది. వీటితో యూజర్స్ తమ ఫొటోలను అప్‌లోడ్ చేసి నాసా మార్స్‌ మిషన్‌లో పాల్గొన్నట్లుగా ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

అంగారకుడితో ఫొటో కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని