Updated : 08/09/2021 20:24 IST

IOS 15: యాడ్స్ తగ్గించుకునేందుకు ఐఓఎస్ 15లో కొత్త ఫీచర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పటి నుంచో ఐఫోన్‌ యూజర్లు ఎదురు చూస్తున్న ఐఓఎస్ 15 వెర్షన్‌ సెప్టెంబర్‌లోనే (14వ తేదీ) విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఐఓఎస్ యూజర్ల కోసం అప్‌డేట్‌ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్లను యాపిల్‌ పరిచయం చేయనుంది. పర్సనలైజ్‌డ్‌ యాడ్స్‌ విషయంలో యూజర్లను అలర్ట్‌ చేసేందుకు రిమైండర్‌ను ఐఓఎస్‌ 15 వెర్షన్‌లో యాడ్‌ చేయనుంది. ఎవరైనా యూజర్‌ ఎనేబుల్‌ చేస్తేనే పర్సనలైజ్‌డ్‌ యాడ్స్‌ వస్తాయి. పర్సనలైజ్‌డ్‌ అడ్వర్టైజింగ్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. డిజిటల్ వేదికగా యాడ్స్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. యూజర్‌ సెర్చింగ్‌ను అనుసరించి ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల యాడ్స్‌ను పంపిస్తుంటాయి. అయితే ఇవే కొంతమందికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. యాడ్స్‌ ఎక్కువగా వస్తుంటే ఇబ్బంది పడే వారికి యాపిల్‌ ఓ ఆప్షన్‌ను ఇవ్వనుంది. ఇలాంటి వారి కోసం యాపిల్‌ ఫీచర్‌ను అందించనుంది.

ఐఓఎస్‌ 15 వెర్షన్‌లో యాప్‌ను ఓపెన్‌ చేసినప్పుడే యూజర్‌కు పర్సనలైజ్‌డ్‌ యాడ్స్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలా వద్దా..? అనే అడుగుతుంది. అప్పుడే నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా ఈ ఫీచర్‌ను ఆఫ్‌ చేసేందుకు డివైజ్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఎలాంటి రివైండర్‌ రాకపోతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఓపెన్ చేసి యాపిల్‌ యాడ్స్‌ను ఎనేబుల్‌ లేదా డిజేబుల్‌ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడొక సమస్య ఉన్నట్లు టెక్‌ నిపుణులు గుర్తించాయి. ఈ ఫీచర్‌ను టర్న్‌ఆఫ్‌ చేసుకుంటే పర్సనలైజ్‌డ్ ప్రకటనలు పూర్తిగా ఆగిపోవు. అయితే వచ్చే ప్రకటనల సంఖ్యను మాత్రం తగ్గించుకోవచ్చు. ఇది కూడా చాలా మంది యూజర్లకు చికాకు పుట్టించే అంశమే. దీని వల్ల థర్డ్‌పార్టీ ప్రకటనలను పరిమితం చేయగలిగినా.. ఫస్ట్‌ పార్టీ ప్రకటనలను మాత్రం ఆపలేకపోతోంది. దీని కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

భద్రత, వ్యక్తిత గోప్యతకు ప్రాధాన్యమిచ్చే యాపిల్‌ మరో ఫీచర్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. చైల్డ్‌ అబ్యూజ్‌ ఇమేజ్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ను ఐఫోన్స్‌కు అనుసంధానించాలని యాపిల్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రాకింగ్‌ హిస్టరీతో చిన్నారుల ఇమేజ్‌లను దుర్వినియోగం చేసేవారిపట్ల ఇది అప్రమత్తంగా ఉంటుంది. అయితే ఇది ప్రైవసీకి సంబంధించి కొన్ని సమస్యలు వస్తున్నాయని, యూజర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని యాపిల్‌ ఇటీవల వెల్లడించింది. వినియోగదారులు, న్యాయసలహాదారులు, పరిశోధకులు ఇతర యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నామని, ఈ సమస్యపై రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని యాపిల్‌ తెలిపింది. చైల్డ్‌ సేఫ్టీ ఫీచర్లకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నట్లు వెల్లడించింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని