Nokia G 20: సింగిల్‌ ఛార్జ్‌.. 3 రోజుల బ్యాకప్‌

కొద్ది నెలల క్రితం జీ, సీ, ఎక్స్‌ సిరీస్‌ ఫోన్లతో సందడి చేసిన నోకియా..తాజాగా మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా నోకియా జీ20 మోడల్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ధర, ఆకర్షణీయమైన ఫీచర్స్‌, మెరుగైన బ్యాటరీతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని నోకియా చెబుతోంది... 

Updated : 05 Jul 2021 20:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్ది నెలల క్రితం జీ, సీ, ఎక్స్‌ సిరీస్‌ ఫోన్లతో సందడి చేసిన నోకియా..తాజాగా మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా నోకియా జీ20 మోడల్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ధర, ఆకర్షణీయమైన ఫీచర్స్‌, మెరుగైన బ్యాటరీతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని నోకియా చెబుతోంది. 

నోకియా జీ20 ఫీచర్స్‌

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా రెండు సంత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, మూడు సంవత్సరాల పాటు నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లను యూజర్స్‌కి అందివ్వనున్నారు. అంటే ఆండ్రాయిడ్ 12, 13 లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 5 ఎంపీ, రెండు 2 ఎంపీ కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే మూడు రోజులపాటు పనిచేస్తుందని నోకియా తెలిపింది. ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర ₹12,999గా కంపెనీ నిర్ణయించింది. జులై 7తేదీ నుంచి నోకియా, అమెజాన్‌ వెబ్‌సైట్‌లలో జీ20 ముందస్తు బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. గ్లేసియర్, నైట్‌ రంగుల్లో లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని