Published : 30/09/2021 15:35 IST

Poco C31: బడ్జెట్‌లో పోకో నుంచి కొత్త ఫోన్‌.. ఓ లుక్కేయండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ధరలో పోకో బ్రాండ్‌ నుంచి మరో ఫోన్‌ రిలీజైంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారి కోసం సీ31 పేరిట కొత్త మొబైల్‌ను పోకో భారత మార్కెట్లోకి గురువారం విడుదల చేసింది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే రెండురోజుల పాటు ఛార్జింగ్‌ వచ్చే బ్యాటరీ, ట్రిపుల్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకతలు.

పో సీ31 రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ వస్తోంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.9,499గా పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సందర్భంగా అక్టోబర్‌ 2 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్‌ ఆఫర్‌ కింద రెండు వేరియంట్లపైనా రూ.500 చొప్పున తగ్గింపు లభించచనుంది. ఇవి కాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ కార్డు హోల్డర్లు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు.

పోకో సీ31 ఫీచర్ల విషయానికొస్తే 6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. మీడియాటెక్‌ హీలియో జీ35తో ఈ ఫోన్‌లో అమర్చారు. అంతర్గత మెమొరీని 512జీబీ వరకు పెంచుకునే వీలుంది. వెనుక వైపు 13 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు రెండు 2ఎంపీ కెమెరాలు అమర్చారు. సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులోని 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రెండు రోజుల పాటు బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వెనుకవైపు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో పాటు, ఫేస్‌ అన్‌లాక్‌ సదుపాయం కూడా ఉంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని