Snapdragon: క్వాల్‌కోమ్‌ కొత్త ఫోన్‌ ధరెంతంటే..?

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్‌తో సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధర నుంచి ప్రీమియం కేటగిరీ వరకు ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి‌... 

Published : 09 Jul 2021 23:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్‌తో సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధర నుంచి ప్రీమియం కేటగిరీ వరకూ ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి‌. తాజాగా స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్ కంపెనీ క్వాల్‌కోమ్ తీసుకొచ్చిన ప్రీమియం మోడల్‌ ఫోన్‌ ప్రస్తుతం మార్కెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్వాల్‌కోమ్‌ కంపెనీ ఆసుస్‌తో కలిసి ‘స్మార్ట్‌ఫోన్ ఫర్‌ స్నాప్‌డ్రాగన్‌ ఇన్‌సైడర్స్‌‌’ పేరుతో ఈ ఫోన్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో క్వాల్‌కోమ్‌ సంస్థ స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్స్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఎంపిక చేసిన వారికి తాము కొత్తగా తీసుకొచ్చే టెక్నాలజీలను పరీక్షించే అవకాశాన్ని కల్పిస్తారు. క్వాల్‌కోమ్ కంపెనీ కొత్త చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్ ఫర్ స్నాప్‌డ్రాగన్‌ ఇన్‌సైడర్స్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ ధరెంత.. ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.

స్నాప్‌డ్రాగన్‌ ఇన్‌సైడర్స్‌ ఫీచర్స్‌

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నెట్‌వర్క్‌ కనెక్టివిటీ కోసం సిగ్నల్ బూస్ట్ టెక్నాలజీతో పాటు స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌60 మోడెమ్‌ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్‌ హెడీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ఉంది. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలీఫొటో షూటర్ కెమెరాలు అమర్చారు. టెలీఫొటో కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. వీడియోకాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 24ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది క్వాల్‌కోమ్‌ క్విక్‌ ఛార్జ్‌ 5.0 ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 

స్మార్ట్‌ఫోన్ ఫర్‌ స్నాప్‌డ్రాగన్‌ ఇన్‌సైడర్స్‌ 6జీబీ ర్యామ్‌ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. దీని ధర 1,499 డాలర్లు. భారత్‌ మార్కెట్లో దీని ఖరీదు రూ.1,11,900గా కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్ బ్లూ రంగులో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్‌ ఇన్‌సైడర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ కస్టమర్స్‌కి ఆగస్టు నుంచి అసుస్ ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని