Android: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ తప్పులు చేశారో.. హ్యాకర్లకు దొరికేసినట్లే!
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి కొన్ని ముప్పులూ పొంచి ఉన్నాయి. వాటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ ముప్పులేంటో? ఎవరి నుంచో తెలుసా?... రండి తెలుసుకుందాం!
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ఫోన్ల (Smart Phones) ప్రపంచంలో ఆండ్రాయిడ్ ఫోన్లదే హవా. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)లోని ఫీచర్లు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. దానికి తగ్గట్టే ఆండ్రాయిడ్ (Android) ఫోన్లు వాడే వారికి ముప్పులూ పొంచి ఉన్నాయి. మొబైల్స్ వినియోగంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన పాలిట ముప్పులు అవుతాయని తెలుసా? అయితే చదివేయండి... తెలుసుకోండి... జాగ్రత్తపడండి!
అవసరం ఉన్నా లేకున్నా రకరకాల యాప్స్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఓ లుక్కేసి వదిలేస్తుంటారు. ఒక్కోసారి ఏపీకేల రూపంలోనూ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇలాంటి యాప్స్‌తో హ్యాకర్స్ (Hackers), స్కామర్స్ (Scammers) ఉపాధి పొందుతున్నారు. మాల్వేర్ (Malware)ను పక్కన పెడితే కొన్ని యాప్‌లు మనకు ప్రకటనలు చూపిస్తూ... కాసులు వెనకేసుకుంటున్నాయి. వాటి వల్ల మన ఫోన్ నెమ్మదించడమే గాక, వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్తోంది.
బ్లోట్‌వేర్ (Bloatware)
బ్లోట్‌వేర్ (డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్) ఫోన్ మెమొరీని ఆక్రమించేస్తుంది. అంతేకాదు మిగతా యాప్‌ల (Apps) పనితీరును కూడా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఫోన్‌తో పాటే బ్లోట్‌వేర్ వస్తుంటుంది. అందుకే వాటిని తొలగించడమే మేలు అని చెబుతున్నారు. అలానే కొన్ని యాప్స్ మన ప్రమేయం లేకుండానే ఫోన్లో తిష్ఠ వేస్తుంటాయి. యాడ్స్ డిస్ప్లే చేస్తూ.. డివైజ్‌ను (Device) ట్రాక్ చేస్తూ.. మన కాంటాక్ట్స్ లిస్ట్‌ను దొంగలిస్తూ ఉంటాయి. అలాంటి యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసేయండి.. కుదరని పక్షంలో సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటికి డేటా యాక్సెస్ ఆఫ్ చేసేయండి.
ఫోన్ లాక్ స్క్రీన్ ఇంకోటి
ఫోన్ లాక్ స్క్రీన్‌ను (Lockscreen) ప్రొటెక్ట్ చేసుకోవడం కీలకం. లేకపోతే ఫోన్లోకి చొరబడి హ్యాకర్లు మనకు తెలియకుండానే మన సమాచారం దొంగిలిస్తారు. అంతేకాదు ఆన్లైన్లో పర్సనల్ డేటాను అందుబాటులోకి తెస్తుంటారు. అందుకే పిన్ లేదా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఫోన్ లాక్ చేయాలి. కనీసం ప్యాట్రన్ స్క్రీన్‌లాక్ అయినా పెట్టుకోవాలి.
గూగుల్ ఫైండ్ డివైజ్
ఎప్పుడు కొత్త ఫోన్ కొన్నా.. గూగుల్ (Google) ఫైండ్ డివైజ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే, ఫోన్ పోయినప్పుడు మీ డివైజ్‌ను ట్రాక్ చేయటానికి ఉపయోగపడుతుంది. అలానే పాస్వర్డ్ లేకుండా మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయటం, మొబైల్ డేటాను ఆఫ్ చేయకుండా లాక్‌స్క్రీన్ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి.
యాప్స్ లిస్ట్ చెక్ చేసుకోవాలి
ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి డౌన్లోడ్ (Download) చేసిన యాప్స్ లిస్ట్ చూసుకుంటుండటం అలవాటుగా మార్చుకోవాలి. కొన్ని మాల్వేర్/ స్పైవేర్ యాప్స్ మనకు తెలియకుండానే ఫోన్ యాప్స్ లిస్ట్‌లో వచ్చి పడుతుంటాయి. అవి హోంస్క్రీన్‌లో ఐకాన్ కూడా క్రియేట్ చేయకుండా మన ఫోన్లో దాగి ఉంటాయి. అలాంటి వాటిని ఒకసారి చూసి అన్ఇన్స్టాల్ చేసేయండి.
పాస్వర్డ్ ఛేంజ్ చేయకపోవడం...
ఎక్కువమంది చేసే తప్పు పాస్వర్డ్ తరచుగా మార్చకపోవడం. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం క్రియేట్ చేసిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతోనే ఇప్పటికీ బండి లాగించేస్తుంటారు. కానీ హ్యాకర్లకు ఇదే పెద్ద ఆయుధం. వారికి సందు దొరికేది ఇక్కడే. మనం పదే పదే ఏ కీవర్డ్స్ టైప్ చేస్తున్నామో గుర్తించి దాని ద్వారా మన లాగిన్ వివరాలు తెలుసుకోవడం వారికి పెద్ద కష్టం కాదు. అందుకే మన పాస్‌వర్డ్‌లను (Passwords) ఎప్పటికప్పడు మార్చుకుంటూ ఉండాలి. వీలైనంత కష్టంగా మన పాస్‌వర్డ్‌లను పెట్టాలి. అన్ని అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ పెట్టకపోవడం ఉత్తమం.
థర్డ్ పార్టీ యాప్స్
ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేయనివ్వకుండా సెట్టింగ్స్‌లో మార్పు చేయాలి. ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయటం వల్ల మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయ్యే యాప్స్ కాని, గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి కాకుండా ఇతర సైట్ల నుంచి డౌన్లోడ్ అయ్యే యాప్స్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేయనివ్వకుండా నిరోధిస్తుంది.
ఏపీకే(APK) ఫైల్స్
ఏపీకే ఫైల్స్ (APK Files) ఎలా పని చేస్తాయో తెలుసుకోకుండా డౌన్లోడ్ చేసి వాడేస్తే.. మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి నెట్టుకున్నట్లే. గూగుల్ ప్లేస్టోర్‌లో దొరకని చాలా యాప్స్ ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ద్వారా బయట దొరకుతుంటాయి. అవి చాలా వరకు మీ అనుమతి లేకుండానే మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. అలాంటి వాటికి గూగుల్ అనుమతివ్వదు. అందుకే ప్లేస్టోర్‌లో దొరకవు. కావున ఏపీకే ఫైల్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
యాప్ పర్మిషన్స్
యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు... వాళ్లు పెట్టే షరతులు, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక వాల్‌పేపర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ యాప్‌కు మన ఫోన్లో గ్యాలరీని (Gallery) యాక్సెస్ చేసుందుకు అనుమతి ఇస్తే సరిపోతుంది. అంతకుమించి కాంటాక్ట్స్ లిస్ట్, మైక్, జీపీఎస్ లొకేషన్, కెమెరా (Camera) తదితర వాటిని యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ అడుగుతుంటే.. ఆ యాప్ మంచిదా, కాదా అని ఆలోచించాల్సిందే. ప్రత్యామ్నాయ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి