Published : 02/12/2021 01:50 IST

Twitter: ట్విటర్‌లో మార్పులు.. ఇకపై అవి షేర్‌ చేయలేరు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌.. కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇకపై ఇతర వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తమ ఖాతాల్లో షేర్‌ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఒక వేళ పోస్ట్‌ చేయాలనుకుంటే సదరు వ్యక్తి అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించకపోవడంతో పాటు అసభ్యకర ఫొటోలు, వీడియోలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త పాలసీని ప్రధానంగా అమెరికా బయట ఉన్న దేశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించారట. గతంలో అత్యాచార బాధితుల చిత్రాలు పోస్ట్‌ చేయడం, అఫ్గానిస్థాన్‌లో బుర్కా లేకుండా బయటికి వెళ్లిన ముస్లిం మహిళలు బహిరంగరంగా దాడికి గురవ్వడం వంటి చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. వ్యక్తిగత సంభాషణలను స్ర్కీన్‌షాట్‌గా తీసి షేర్‌ చేయొచ్చని, అందులో సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్లు, చిరునామాలు లేదా ఈ-మెయిల్ ఐడీ సమాచారం ఉండకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పాలసీని పాటించకపోతే నియమ నిబంధన ఉల్లంఘన తీవ్రతతో పాటు ఎన్నిసార్లు అలా చేశారో లెక్కించి, దాని ఆధారంగా శాశ్వతంగా వారి అకౌంట్స్‌ను తీసివేస్తామని ట్విటర్‌ హెచ్చరించింది. అనుమతి లేకుండా ఎవరైనా ఫొటో, వీడియోని షేర్‌ చేస్తే ట్విటర్‌లో రిపోర్ట్‌ చేయొచ్చని పేర్కొంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని