Updated : 29/10/2021 16:54 IST

Whatsapp cashback: వాట్సాప్‌ గుడ్‌న్యూస్‌.. పేమెంట్‌ చేస్తే ₹51 క్యాష్‌బ్యాక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను ఇటీవల ప్రారంభించిన వాట్సాప్‌.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు క్యాష్‌బ్యాక్‌ సదుపాయం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఆఫర్‌ అందిస్తోంది. త్వరలో అందరికీ ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్‌ బీటా వినియోగదారులకు ‘గివ్‌ క్యాష్‌, గెట్‌ ₹51’ పేరిట బ్యానర్‌ ప్రదర్శిస్తోంది. వారు నచ్చిన ఐదుగురికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే వెంటనే వారికి రూ.51 క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్‌ అందిస్తోంది. ఇంత మొత్తం పంపాలన్న నియమేమీ లేదు. ఒకవేళ రూపాయి పంపించినా రూ.51 చొప్పున క్యాష్‌బ్యాక్‌ అందుతోంది. పేమెంట్‌ పూర్తయిన కాసేపటికే క్యాష్‌బ్యాక్‌ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్‌ సదుపాయం గరిష్ఠంగా ఐదుగురికి పంపడానికే వర్తిస్తుంది.

ఈ క్యాష్‌బ్యాక్‌ సదుపాయం త్వరలో అందరికీ తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పేమెంట్‌ సేవలను ప్రారంభించిన తొలి నాళ్లలో గూగుల్‌ పే కూడా స్క్రాచ్‌ కార్డుల రూపంలో క్యాష్‌బ్యాక్‌ అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పేటీఎం, ఫోన్‌పై సైతం ఇవే మార్గాలను అనుసరించాయి. ఇప్పుడు వాట్సాప్‌ సైతం అదే తరహాలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని