ఉభయ సభల నుంచి తెరాస వాకౌట్‌

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై లోక్‌సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీల నిరసన కొనసాగింది. వారు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రశ్నోత్తరాల సమయం యథావిధిగా నడిచింది. ధాన్యం సేకరణ చేపట్టాలని, కనీస

Published : 07 Dec 2021 04:17 IST

నోటీసులపై కేంద్రం స్పందించక పోవడంతో నిర్ణయం
నేడు నల్ల చొక్కాలతో పార్లమెంటులో నిరసన
ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్న నామా

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న తెరాస పార్లమెంటరీ, లోక్‌సభ పక్ష నేతలు కేశవరావు,

నామా నాగేశ్వరరావు, ఎంపీలు వెంకటేష్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌, పసునూరి

దయాకర్‌, రంజిత్‌రెడ్డి, రాములు, మాలోత్‌ కవిత, బి.బి.పాటిల్‌, సురేశ్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై లోక్‌సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీల నిరసన కొనసాగింది. వారు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రశ్నోత్తరాల సమయం యథావిధిగా నడిచింది. ధాన్యం సేకరణ చేపట్టాలని, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలంటూ ఉభయ సభల్లో సోమవారం కూడా తెరాస సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ లోక్‌సభలో లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్వల్పకాలిక చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన సభ్యులు ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘అంబేడ్కర్‌ వర్ధంతి రోజునే పార్లమెంట్‌ సాక్షిగా భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అబద్ధాలు చెప్పారు. లోక్‌సభలో అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు యావత్‌ దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. రైతుల కోసం పోరాడుతున్న తమపై చట్టసభల్లో ఆరోపణలు చేయడం అర్థ రహితం. కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పిన తర్వాతే వరి పంట వేయొద్దని రైతులకు చెబుతున్నాం. భాజపా నేతలు మాత్రం వరి సాగుచేయమంటున్నారు. రైతులు వరి సాగుచేసి  ఇబ్బందులు పడితే దాన్ని రాజకీయం చేయాలని భాజపా నేతలు చూస్తున్నారు’’ అని నామా మండిపడ్డారు. ఎఫ్‌సీఐ రాష్ట్ర రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రైతుల సమస్యను వివరించేందుకు ప్రయత్నించే తమకు మైక్‌ ఇవ్వడం లేదని, తమపై ఆరోపణలు చేసేందుకు భాజపా సభ్యులకు మైక్‌ ఇస్తున్నారని ఆక్షేపించారు.

క్షేత్రస్థాయికి వెళ్లేందుకు వ్యూహం!

పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మంగళవారం నల్ల చొక్కాలు ధరించి సభలకు హాజరుకావాలని తెరాస సభ్యులు నిర్ణయించారు. మంగళవారం ఉభయ సభల్లో మాట్లాడేందుకుగానీ, చర్చకుగానీ అవకాశం కల్పించకపోతే శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని తెరాస సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయికి వెళ్లి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతులకు వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని