Updated : 24/11/2021 05:07 IST

MLC Elections: 12 స్థానాలకు 102 నామినేషన్లు

ఆదిలాబాద్‌లో ఒకే స్థానానికి 24 మంది నామినేషన్లు

నిజామాబాద్‌లో ఇద్దరే..

కరీంనగర్‌లో స్వతంత్రుడిగా తెరాస మాజీ మేయర్‌

మెదక్‌, ఖమ్మం బరిలో కాంగ్రెస్‌

రంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాల చించివేతతో ఉద్రిక్తత

రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు చించివేస్తున్న వ్యక్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను తెరాస మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ మెదక్‌, ఖమ్మంలలో తన అభ్యర్థులను నిలిపింది. కరీంనగర్‌ మాజీ మేయర్‌, తెరాస నేత రవీందర్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. 

* నిజామాబాద్‌లో తెరాస అభ్యర్థినిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయగా.. అందులో ‘మద్దతు సంతకాలు’ తమవి కావని ఇద్దరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వివాదం ఏర్పడింది.

* గారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైతం దాఖలు చేశారు.

* రీంనగర్‌లో రెండు స్థానాలకు 27 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, మాజీ మంత్రి ఎల్‌.రమణ బరిలో నిలిచారు. తనకు కీలక పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. మరో 24 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

* హబూబ్‌నగర్‌లో 2 స్థానాలకు 10 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మరో ఎనిమిది మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలుచేశారు.

* మ్మంలో ఒక స్థానానికి తెరాస అభ్యర్థిగా తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌ తరఫున రాయల నాగేశ్వరరావులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

* మెదక్‌లో ఒక స్థానానికి ఏడుగురు నామినేషన్లు వేశారు. వీరిలో తెరాస అభ్యర్థిగా డాక్టర్‌ యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థినిగా సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలతో పాటు అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

* నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి 11 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు  దాఖలు చేశారు.

* వరంగల్‌లో ఒక స్థానానికి 14 నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి,  మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.

* ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక స్థానానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో తెరాస అభ్యర్థిగా దండె విఠల్‌, మరో 23 మంది స్వతంత్రులు ఉన్నారు.

మూడోసారి నామినేషన్‌ దాఖలుకు వెళ్తున్న స్వతంత్ర అభ్యర్థి శైలజ చేతిలో పత్రాలను లాక్కునేందుకు
యత్నిస్తున్న వ్యక్తిని నిలువరిస్తున్న పోలీసులు


అఫిడవిట్‌లో కవిత కుటుంబ ఆస్తులు..

ఈనాడు, నిజామాబాద్‌: తన పేరుపై రూ.14.78 కోట్లు, భర్త పేరిట రూ.14 కోట్లు, ఇద్దరు పిల్లల పేర్లపై రూ.8.90 లక్షల చరాస్తులున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె పేరుపై రూ.9.30 కోట్లు, భర్త పేరిట రూ.9.39 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. దంపతులిద్దరి పేరిట రూ.21.62 కోట్ల అప్పులు ఉన్నట్లుగా చూపారు. ఉద్యమ సమయంలో రెండు కేసులు నమోదైనట్లు ప్రస్తావించారు.


రంగారెడ్డిలో ఘర్షణ..

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను తెరాస మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మంగళవారం ఉదయం తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. వారికి మద్దతుగా వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కలెక్టరేట్‌ గేటు వద్దే వేచి ఉన్నారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు తెలంగాణ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి భార్య, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు చింపుల శైలజ కలెక్టరేట్‌కు వచ్చారు. వారిని అక్కడున్న నాయకులు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేశారు. అలా మూడుసార్లు జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తన కుమారుడు అశ్విన్‌రెడ్డిపై, ప్రపోజర్స్‌పైనా దాడి జరిగిందని సత్యనారాయణరెడ్డి వాపోయారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనపై  శైలజ సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లను పట్నం మహేందర్‌రెడ్డి పీఏ మల్లారెడ్డి లాక్కోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని