Updated : 11/10/2021 09:36 IST

TSRTC: దసరా ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే

ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలును ఆర్టీసీ విరమించుకుంది. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని, ఈ నిర్ణయం ఆదివారం నుంచే అమలవుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌  ప్రకటించారు. కొన్నేళ్లుగా పండగల ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా ప్రత్యేక బస్సుల ఏర్పాటు సమయంలోనూ 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా సమయంలో ప్రజలపై అదనపు భారం మోపకూడదని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. ‘‘గత అయిదు రోజుల్లో కోటి 30 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చాం. ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇదే ఉదాహరణ. రానున్న పండగల రోజుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తాం. సురక్షిత ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీనే ఎంచుకోవాలి’’ అని సజ్జనార్‌ కోరారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని