నిఖత్‌ మెరుపులు మొదలైందిక్కడే!

మూడు షట్టర్‌ గదులతో కూడిన ఈ రేకుల షెడ్డే.. ఔత్సాహిక యువతను బాక్సింగ్‌లో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కర్మాగారమంటే నమ్మబుద్ధి కాదు.

Published : 22 May 2022 06:44 IST

ఈనాడు, నిజామాబాద్‌: మూడు షట్టర్‌ గదులతో కూడిన ఈ రేకుల షెడ్డే.. ఔత్సాహిక యువతను బాక్సింగ్‌లో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కర్మాగారమంటే నమ్మబుద్ధి కాదు. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌ సహా మరో అయిదుగురు అంతర్జాతీయ, 25 మంది జాతీయస్థాయి క్రీడాకారులు తొలుత ఇక్కడ శిక్షణ పొందినవారే. నిజామాబాద్‌లోని డీఎస్‌ఏ మైదానంలో 80 ఏళ్ల వయసున్న బాక్సింగ్‌ శిక్షకుడు సంసముద్దీన్‌ దీన్ని నడిపిస్తున్నారు. అరకొర వసతులున్నా.. తనకున్న అనుభవాన్ని జోడించి క్రీడాకారులను సాన పడుతున్నారు. నిఖత్‌ జరీన్‌ సైతం 2009-2012 మధ్య ఇక్కడే తర్ఫీదు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో బాక్సింగ్‌ అకాడమీని కేటాయించి, తగిన వసతులు కల్పించి, ఆసక్తిగల యువతను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని