‘పాత పింఛను ఇచ్చే పార్టీలకు ఓటు వేయాలి’

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పాత పింఛను ఇచ్చే పార్టీలకే సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు వేయాలని పాత పింఛను జాతీయ పోరాట కమిటీ కార్యదర్శి స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. శనివారం రాజస్థాన్‌లో

Published : 22 May 2022 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పాత పింఛను ఇచ్చే పార్టీలకే సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు వేయాలని పాత పింఛను జాతీయ పోరాట కమిటీ కార్యదర్శి స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. శనివారం రాజస్థాన్‌లో ఆ సంఘం 18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీపీఎస్‌ సంఘం నుంచి కల్వల శ్రీకాంత్‌, నరేష్‌గౌడ్‌ హాజరయ్యారు. రాజస్థాన్‌లో అమలుచేస్తున్న పాత పింఛను విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని