కొత్త వైద్య కళాశాలల్లో 100 చొప్పున సీట్లు

రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 8 వైద్య కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Published : 22 May 2022 06:24 IST

అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 8 వైద్య కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగా ఒక్కో కళాశాలలో 100 చొప్పున సీట్లు, జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం 430 పడకలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రులను గుర్తించి వాటిలో అదనపు పడకలను సమకూర్చనుంది. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నిర్మాణ, పరికరాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థకు వైద్యవిద్య సంచాలకులు కె.రమేష్‌రెడ్డి లేఖ రాశారు. కళాశాలల్లో చదివే విద్యార్థులకు వసతి గృహాలు తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు. జనగామ జిల్లా ఆస్పత్రిలో 200 పడకలు అందుబాటులో ఉన్నాయని, మరో 230 పడకలు కల్పించాలని తెలిపారు. భూపాలపల్లి ఆస్పత్రిలో 40, కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 280, ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో 30, ఆసిఫాబాద్‌ సీహెచ్‌సీలో 45, సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో 30, వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో 280 పడకల అవసరముందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని