జిమ్‌కు వెళుతున్నారా...

రాధ రోజూ ఇంటి దగ్గర్లో ఉండే జిమ్‌కు పిల్లలతోపాటు వెళ్లేది. అక్కడ ఓ అరగంట అందరూ కలిసి చిన్నచిన్న వ్యాయామాలు, యోగా చేసేవారు. కొవిడ్‌ ప్రభావంతో ఆమె జిమ్‌ మానేసింది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న ఈ సమయంలో తిరిగి పిల్లలను తీసుకుని జిమ్‌కు వెళ్లాలని ఉన్నా భయపడుతోంది. ఇటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తక్కువని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేంటో చూద్దాం.

Updated : 09 Sep 2021 12:51 IST

రాధ రోజూ ఇంటి దగ్గర్లో ఉండే జిమ్‌కు పిల్లలతోపాటు వెళ్లేది. అక్కడ ఓ అరగంట అందరూ కలిసి చిన్నచిన్న వ్యాయామాలు, యోగా చేసేవారు. కొవిడ్‌ ప్రభావంతో ఆమె జిమ్‌ మానేసింది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న ఈ సమయంలో తిరిగి పిల్లలను తీసుకుని జిమ్‌కు వెళ్లాలని ఉన్నా భయపడుతోంది. ఇటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తక్కువని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేంటో చూద్దాం.

* సిద్ధంగా...

పిల్లలను తీసుకెళ్లినప్పుడు ఇరుకుగా ఉండే జిమ్‌ కాకుండా, విశాలంగా  బయటిగాలి లోపలికి వచ్చే సౌకర్యం ఉండేదాన్ని ఎంచుకుంటే మంచిది. వెళ్లేటప్పుడు వారికి మంచినీళ్ల సీసా, మాస్కు, తువ్వాలు, మ్యాట్‌, హ్యాండ్‌ గ్లవుజులు, శానిటైజర్‌ ఉంచిన బ్యాగు ఎవరిది వారికి అందించాలి. మీకూ విడిగా సిద్ధం చేసుకోవాలి. ఇతరుల వస్తువులు అడగకుండా, తమ వస్తువులనే వినియోగించుకోవాలని పిల్లలకు చెప్పాలి. జిమ్‌లో పాటించాల్సిన నియమాలను ముందుగానే వారికి నేర్పడం మంచిది.  

* సమయపాలన...

కేటాయించుకున్న సమయానికి జిమ్‌కు చేరుకోవాలి. ముందుగానే అక్కడకు వెళ్లి, జనం మధ్యలో ఉండకూడదు. అలా పది నిమిషాల ముందుగా వెళ్లినా, జిమ్‌కు బయట దూరంగా నిలబడటం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు కూడా మిగతా వారికి, మీకూ మధ్య కనీస దూరాన్ని పాటించాలి. ఈ అంశాన్ని పిల్లలకూ అలవడేలా చేయాలి. అప్పటివరకు మరొక వ్యక్తి వినియోగించిన జిమ్‌ సామాగ్రిపై బ్యాక్టీరియా, సూక్ష్మజీవులుండే ప్రమాదం ఉంది. వాటిని ముట్టుకునే ముందు చేతులకు, ఆ పరికరాలకు శానిటైజర్‌ రాయడం మర్చిపోకూడదు. ఆ తర్వాతే... వ్యాయామాలు మొదలుపెట్టడం అలవాటు చేసుకోవాలి.    

* సూచనలు

జిమ్‌కు వెళ్లేటప్పుడు ధరించే మాస్కును వ్యాయామాలు మొదలుపెట్టే ముందు తీసేయాలి. ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు మాస్కు ఉంటే రక్తప్రసరణలో మార్పులొస్తాయి. ఆక్సిజన్‌ అందక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలకు లేదా మీకు కాస్తంత సుస్తీగా ఉందంటే జిమ్‌కు సెలవు పెట్టడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్