చలిలో వెచ్చదనం...

ఎండైనా చలైనా మనం పొద్దునే లేవాల్సిందే కదా! కానీ ఈ కాలంలో కండరాలు బిగుసుకుపోతాయి. కీళ్లనొప్పులొస్తాయి. శ్వాస ఇబ్బందులొస్తాయి. బద్ధకంగా ఉంటుంది. ఈ సమస్యల్ని తరిమేసి ఉత్సాహంగా ఉండేందుకు ఈ ఆసనాలను ప్రయత్నించండి...

Updated : 19 Oct 2022 16:04 IST

ఎండైనా చలైనా మనం పొద్దునే లేవాల్సిందే కదా! కానీ ఈ కాలంలో కండరాలు బిగుసుకుపోతాయి. కీళ్లనొప్పులొస్తాయి. శ్వాస ఇబ్బందులొస్తాయి. బద్ధకంగా ఉంటుంది. ఈ సమస్యల్ని తరిమేసి ఉత్సాహంగా ఉండేందుకు ఈ ఆసనాలను ప్రయత్నించండి...

పరిగాసనం:  రెండు మోకాళ్ల మీద కూర్చుని కుడికాలిని ఎదురుగా కాకుండా పక్కకు తిన్నగా జరపాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులూ పైకి పెట్టి శ్వాస వదులుతూ పక్కకు పెట్టిన కాలివైపు సాధ్యమైనంత వంగాలి. అవసరమైతే చీలమండ దగ్గర పట్టుకోవచ్చు. మళ్లీ శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రావాలి. మూడు సార్లు చేశాక ఎడమకాలిని పక్కకు పెట్టి ఇలాగే చేయాలి. ఈ ఆసనం వల్ల శరీరంలో తగినంత వేడి పుడుతుంది. మోకాళ్లకు సర్జరీ అయినవాళ్లు, తీవ్ర మోకాళ్ల నొప్పులతో కూర్చోలేని వాళ్లు తప్ప ఈ ఆసనం అందరూ చేయొచ్చు.

సూర్యముద్ర: రెండు చేతులు, ఉంగరం వేలు మడిచి దానిపైన బొటనవేలు ఉంచి సూర్యముద్రలో కళ్లు మూసుకుని కూర్చుని, ముక్కుతో శ్వాస తీసుకుని వదులుతుండాలి. మరీ వేగంగా, మరీ మెల్లగా కాకుండా సుమారు నలభైసార్లు చేసి కొంతసేపు కళ్లు మూసుకుని అలాగే కూర్చోవాలి. ఈ ముద్రతో శరీరం వేడెక్కుతుంది. సూర్యనాడి ఉత్తేజితమై సైనస్‌, ఆస్తమా, లాంటి చలికాలపు ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సూర్య భేద ప్రాణాయామం: సౌకర్యంగా ఉండేలా కూర్చోవాలి. కుడిచేతి చూపుడు, మధ్య వేళ్లు మడవాలి. ముందుగా ముక్కును ఎడమవైపు మూసి కుడివైపు నుంచి శ్వాస తీసుకుని ఎడమవైపు నుంచి వదలాలి. ఈ ప్రాణాయామంలో శ్వాస కుడివైపు నుంచి తీసుకోవాలి. ఎడమ వైపు నుంచే వదలాలి. ఇలా ఐదు నుంచి పదిసార్లు ప్రశాంతంగా చేస్తే సూర్యనాడి ఉత్తేజితమై శరీరమంతా వేడి పుడుతుంది. మైనస్‌ టెంపరేచర్‌లో కూడా ఈ ప్రాణాయామంతో శరీరం వెచ్చగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్