సంతోషానికి3సూత్రాలు

ఒత్తిడి, ఆందోళనను జయించి సంతోషంగా ఉండాలంటే మూడు సూత్రాలను పాటించాలంటున్నారు హార్వర్డ్‌ ఉమెన్స్‌ హెల్త్‌ వాచ్‌ నిపుణులు. వారు విస్తృత అధ్యయనం చేసి తేల్చినవివీ...

Updated : 11 Jan 2022 05:18 IST

ఒత్తిడి, ఆందోళనను జయించి సంతోషంగా ఉండాలంటే మూడు సూత్రాలను పాటించాలంటున్నారు హార్వర్డ్‌ ఉమెన్స్‌ హెల్త్‌ వాచ్‌ నిపుణులు. వారు విస్తృత అధ్యయనం చేసి తేల్చినవివీ...

చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవద్దు. దాంతో ఒంటరితనం ఆవరించి, కుంగుబాటుకు గురిచేస్తుంది. సానుకూల ఆలోచనలతో, మనసు, మెదడును తేలిక పరుచుకోవాలి. అప్పుడే భవిష్యత్తులోకి ఉత్సాహంగా అడుగు పెట్టొచ్చు. నిత్యం చురుకుగా ఉంటూ.. జీవనశైలి, దినచర్యల్లో మార్పులు చేసుకోవాలి. నాలుగు గోడల మధ్య ఉండి పోకుండా ‘బయటకు వెళ్లడం’, ‘వ్యాయామం’, ‘ఉత్సాహం’గా ఉండటం వంటి మూడు రకాలైన భౌతిక, భావోద్వేగ వ్యూహాలతో నిత్యం మనసును సంతోషంగా ఉంచుకోవచ్చు. తీవ్ర ఒత్తిడికి మాత్రలు మాత్రమే ఔషధం కాదు. ఆ సమయంలో చేసే వ్యాయామం మంచి ప్రభావాన్ని చూపెట్టి, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఒత్తిడిని బయటకు పంపి, నిద్రలేమికి దూరంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరం నుంచి ఎండోర్ఫిన్స్‌ అనే మంచి రసాయనాలు విడుదలై శరీరాన్ని, మనసును ఆహ్లాదంగా మారుస్తాయి. స్వచ్ఛమైన గాలి మెదడును ఉత్సాహవంతం చేస్తుంది. నడక, పరుగు వంటివి మెదడును శక్తివంతంగా చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈత, యోగా వంటివి మెదడులో సెరటోనిన్‌ స్థాయులను పెంచి ఆందోళన నుంచి బయటకు తెస్తాయి. నివసించే ఇల్లు లేదా ఆ ప్రాంతాన్ని మనసుకు ఆహ్లాదం కలిగించేలా ఉంచుకోవాలి. లేదంటే దీని ప్రభావం నిద్రలేమి, నిస్సత్తువ, ఒంటి నొప్పులు వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. నిత్యం సంతోషం, ఉత్సాహాన్ని అందించేలా ఇంటిని తీర్చిదిద్దుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్