ఖర్చును కనిపెడుతుంది...
close
Updated : 30/11/2021 15:10 IST

ఖర్చును కనిపెడుతుంది...

ప్రతినెలా జీతం ఎలా ఖర్చు అవుతోందో.. తెలియక తీవ్రంగా మధనపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో ‘మింట్‌’ యాప్‌ ఉంటే చాలు. నెలనెలా మీ జమాఖర్చు లెక్కలు చూసే గుమాస్తాలాంటిదీ యాప్‌. నిత్యావసర వస్తువులు, గ్యాస్‌, ఇంటి అద్దె వంటి అవసరాలతో పాటు షాపింగ్‌ వరకు మీరు ఖర్చుపెట్టే ప్రతి పైసా సమాచారాన్నీ ఇది అందిస్తుంది. అవసరాలకు మించి అయ్యే వ్యయాన్ని తెలుసుకోవడానికి సాయపడుతుంది. దీంతో అనవసరపు వ్యయాన్ని దూరంగా ఉంచి, పొదుపు మార్గాలను అన్వేషించొచ్చు. అంతేకాదు... ప్రతి నెలా చెల్లించాల్సిన బిల్లులు, ఫీజులు, లోన్స్‌, క్రెడిట్‌కార్డు, ట్యాక్స్‌ వంటి వాటికి కట్టాల్సినవన్నీ ముందే గుర్తు చేస్తుంది. ఖాతాలో పడే నగదు వివరాలనూ అందిస్తుంది. ఆదాయం, వ్యయాన్ని బ్యాలెన్స్‌ చేసి ఆర్థికపరమైన సమస్యలకు చెక్‌ పెట్టడానికి ఈ బడ్జెట్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని