తలను గోడకేసి బాదుకుంటున్నాడు.. ఈ వింత భర్తతో వేగేదెలా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 37. నాకు ఆరు నెలల క్రితం పెళ్లైంది. మాది లేట్‌ మ్యారేజ్‌. నా భర్త నుంచి నేనో వింత సమస్యను ఎదుర్కొంటున్నాను. అతనికి నచ్చనిది ఏదైనా మామూలుగా అడిగినా అతని ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఉదాహరణకు మనం మన పెళ్లిని రిజిస్టర్‌ చేసుకుందాం అంటే ఆ డిస్కషన్‌లోకి వెళ్లకుండా రకరకాలుగా ప్రవర్తిస్తు్న్నాడు.

Published : 26 Jan 2022 12:16 IST

నమస్తే మేడమ్‌.. నా వయసు 37. నాకు ఆరు నెలల క్రితం పెళ్లైంది. మాది లేట్‌ మ్యారేజ్‌. నా భర్త నుంచి నేనో వింత సమస్యను ఎదుర్కొంటున్నాను. అతనికి నచ్చనిది ఏదైనా మామూలుగా అడిగినా అతని ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఉదాహరణకు మనం మన పెళ్లిని రిజిస్టర్‌ చేసుకుందాం అంటే ఆ డిస్కషన్‌లోకి వెళ్లకుండా రకరకాలుగా ప్రవర్తిస్తు్న్నాడు. తలని గోడకేసి రక్తం వచ్చేలా బాదుకోవడం, నేలను నాకడం, గోడకున్న ఫొటోలను తలకేసి బాదుకోవడం, గ్యాస్‌ లీక్‌ చేయటం, చుట్టూ సమాజాన్ని పట్టించుకోకుండా గట్టిగా అరవడం, బాత్రూం క్లీనర్‌ తాగడం, సబ్బు తినడం, ఫోన్‌ విరగ్గొట్టడం.. వంటివి చేస్తున్నాడు. మా వయసు రీత్యా పిల్లల కోసం డాక్టర్‌ దగ్గరకు వెళ్దామా? అన్నా కూడా ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా అతను తన ప్రవర్తనతో నన్ను, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు మారతారా? నేను ఎవరిని సంప్రదించాలి? సలహా ఇవ్వగలరు.

జ. ముందుగా అతని కుటుంబ సభ్యులకు అతని ప్రవర్తన తీరు తెలుసో? లేదో? మాట్లాడి చూడండి. అతని ప్రవర్తన గురించి వాళ్ల కుటుంబ సభ్యులు, పెద్దవాళ్లతో కూడా చర్చించి.. ఆలస్యం చేయకుండా అతడిని మానసిక నిపుణుల వద్దకి తీసుకెళ్లడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్