ఆరోగ్యానికీ మంచిది.. ఈ 'మసాలా ఛాయ్'!

కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలు కాదు చాలామందికి. అయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి గ్రీన్ టీ, అల్లం టీ, పుదీనా టీ.. వంటివి కొందరు తమ రోజువారీ అలవాట్లలో భాగం చేసుకోవడం మనకు తెలిసిందే..

Published : 28 Jan 2022 21:00 IST

కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలు కాదు చాలామందికి. అయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి గ్రీన్ టీ, అల్లం టీ, పుదీనా టీ.. వంటివి కొందరు తమ రోజువారీ అలవాట్లలో భాగం చేసుకోవడం మనకు తెలిసిందే. మరి, మీరెప్పుడైనా 'మసాలా ఛాయ్' ట్రై చేశారా? ఘాటుఘాటుగా ఉండే ఈ టీ వల్ల అటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఇటు బరువూ తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ ఈ చలి కాలంలో, కరోనా సీజన్ లో మరీ మంచిది. మరి, దీన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

కావాల్సినవి

* లవంగాలు

* యాలకులు

* నల్ల మిరియాలు

* సోంపు

* దాల్చిన చెక్క

* అల్లం పొడి

* పాలు

* నీళ్లు

మసాలా తయారీ

ముందుగా మసాలా తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టౌ మీద ప్యాన్ పెట్టుకొని.. అందులో తగినన్ని లవంగాలు, యాలకులు, నల్ల మిరియాలు, సోంపు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇవి కాస్త వేగాక దాల్చిన చెక్క కూడా వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఆఖర్లో అల్లం పొడి వేసి నిమిషం పాటు వేయించి స్టౌ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి.

టీ తయారీ

టీ తయారీ కోసం.. ముందుగా కప్పు నీళ్లను మరిగించాలి. ఇప్పుడు దీనిలో అర టీస్పూన్ మసాలా పొడి, అర కప్పు పాలు కలిపి రెండు నిమిషాల పాటు మరిగిస్తే ఘాటుఘాటుగా ఉండే 'మసాలా ఛాయ్' సిద్ధం..! దీన్ని వేడివేడిగా తాగితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈ చలికాలంలో ఆరోగ్యానికీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్