Good Health: ఇలా చేస్తే చలికాలంలో వ్యాయామం ఎంతో ఈజీ!
'అసలే చలికాలం.. తగిలే సుమబాణం..' అని అదేదో పాటలో చెప్పినట్లుగానే చలికాలంలో వీచే చల్లగాలి కూడా శరీరానికి బాణంలానే గుచ్చుకుంటుంది. మరి ఇంతటి చలిలో లేవడానికే బద్ధకంగా ఉన్నప్పుడు ఇక వ్యాయామం చేయడానికి అస్సలు మనసొప్పదు.
'అసలే చలికాలం.. తగిలే సుమబాణం..' అని అదేదో పాటలో చెప్పినట్లుగానే చలికాలంలో వీచే చల్లగాలి కూడా శరీరానికి బాణంలానే గుచ్చుకుంటుంది. మరి ఇంతటి చలిలో లేవడానికే బద్ధకంగా ఉన్నప్పుడు ఇక వ్యాయామం చేయడానికి అస్సలు మనసొప్పదు. అలాగని వ్యాయామం చేయడం మానేస్తే శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ చలికి తట్టుకునేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. బయట ఎంత చలిగా ఉన్నా వ్యాయామం చేయడం పెద్ద కష్టమనిపించదు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ముందు వేడి పుట్టించండి!
వ్యాయామం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. ఇదే చలి నుంచి శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. కాబట్టి చలిగా ఉందని భయంతో బయటికి వెళ్లకుండా ఉంటే వ్యాయామం చేయలేకపోవడంతో పాటు వెచ్చదనాన్ని కూడా పొందలేం. అందువల్ల ఉదయాన్నే లేచి ఓ పదిహేను నిమిషాల పాటు జాగింగ్‌కి వెళ్లడం మంచిది. దీనివల్ల చలిలో కాసేపు గడిపినట్లుగా ఉండడంతో పాటు తర్వాత చలి తీవ్రత అంతగా తెలియకపోవచ్చు. అలాగే చలికాలంలో వీచే శీతలగాలుల వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవుతాయి. దీంతో వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. కాబట్టి మీరు ముందుగా చేసే జాగింగ్ ప్రక్రియ కండరాలు మామూలు స్థితిలోకి వచ్చేందుకు తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీరు తర్వాత చేయబోయే వ్యాయామానికి వార్మప్‌లా కూడా పనిచేస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తారు.
తేమ శాతాన్ని పెంచండి..
చలికాలంలో చర్మం తేమను కోల్పోవడం, మూత్రం రూపంలో ఎక్కువగా నీరు బయటికి వెళ్లిపోవడం.. వంటి కారణాల వల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోతుంది. కాబట్టి దాహం వేయకపోయినా నీరు, తాజా పండ్ల రసాలు.. వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల కోల్పోయిన తేమను తిరిగి పొందవచ్చు.
తోడుంటే మంచిది..
చలికాలంలో చలికి వ్యాయామం చేయాలనిపించదు.. కానీ చేయక తప్పదు.. అయితే ఇలాంటప్పుడు ఒక్కరే 'సోలో'గా వ్యాయామం చేసేకంటే మీకు తోడుగా మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు.. ఎవరినైనా వ్యాయమం చేయమని అడగండి. ఎందుకంటే ఒక్కరు వ్యాయామం చేయడం కంటే ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. కాబట్టి మీతో పాటు ఎవరో ఒకరిని రోజూ తప్పకుండా వ్యాయామం చేయమని చెప్పండి. దీంతో బోర్ కొట్టకుండా రోజూ హ్యాపీగా వ్యాయామం చేయచ్చు.
సురక్షితంగా ఇలా..
చలికాలంలో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగా ఉన్ని దుస్తులు, చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్సులు ధరించి షూస్ వేసుకోవడం మంచిది. అలాగే తలకు క్యాప్ పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తేనే చలి నుంచి చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడచ్చు. లేదంటే చలికి చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి.
గాలి వీచే దిశలోనే..
జాగింగ్‌కి వెళ్లినా, ఆరుబయట వ్యాయామం చేసినా.. గాలి ఏ దిశగా వీస్తుందనేది ముందు గమనించాలి. అలాగే మీరు కూడా గాలి వీచే దిశలోనే వ్యాయామం చేయాలి. దీనివల్ల చలి తీవ్రత ఎక్కువగా తెలియకుండా ఉంటుంది.
దుస్తులూ ముఖ్యమే!
ఏ కాలమైనా వ్యాయామం చేసే క్రమంలో చెమటలు పట్టడం సహజం. అలాగని చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు కాటన్ దుస్తులు వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కాటన్ చెమటను పీల్చుకోవడం వల్ల దుస్తులు తడిగా అయిపోయి శరీరానికి మరింత చల్లగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ కాలంలో గాలికి త్వరగా ఆరిపోయే సిల్క్ దుస్తులు వేసుకోవడం మంచిది. అలాగే వ్యాయామం పూర్తయిన తర్వాత దుస్తుల్ని వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే తడిగా ఉండే దుస్తుల వల్ల శరీరంలోని వేడి క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం వెచ్చదనాన్ని కోల్పోతుంది. అందుకే తడిగా ఉండే దుస్తుల్ని వెంటనే మార్చుకొని పొడిగా ఉండే వాటిని ధరించడం మంచిది.
చలికాలంలో శరీరాన్ని వ్యాయామం చేసేందుకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి? వ్యాయామం చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకున్నారుగా! మరి, మీరు కూడా వీటిని పాటిస్తూ చలికాలంలోనూ క్రమం తప్పకుండా వ్యాయామాన్ని కొనసాగించండి.. తద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండండి.
Trending
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
- పసిడి మెరుపులు... పంచలోహ పట్టీలు!
- Summer Beauty: మేకప్ చెదిరిపోకుండా..!
ఆరోగ్యమస్తు
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- Mangoes: అందుకే తినేముందు నీళ్లలో నానబెట్టాలి!
- ఆరుబయట ఆడుతున్నారా..!
- నొప్పులు తగ్గించే నిమ్మగడ్డి...
- బెల్లంతో ప్రయోజనాలెన్నో!
అనుబంధం
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
- నేనంటే ప్రాణమంటోంది.. కానీ!
యూత్ కార్నర్
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
- ఆ సమయంలో... అయిదేళ్ల పిల్లనైపోతా!
- కేరళ కుట్టికి... ‘టీన్’ కిరీటం!
'స్వీట్' హోం
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
- ఎయిర్ ప్యూరిఫయర్‌కు బదులు ఇవి!
- వంటింట్లో కీటకాల బెడదా..
- పొందికగా... సర్దేయొచ్చు!
వర్క్ & లైఫ్
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!
- గెలవాలంటే నేర్చుకోవాలి..
- మళ్లీ పెళ్లి వద్దంటోంది..!
- ప్రతిసారీ మర్చిపోతున్నారా?