China: చైనాలో గణనీయంగా తగ్గిన బర్త్‌రేట్‌!

చైనాలో బర్త్‌రేట్‌ (జననాల రేటు) గణనీయంగా తగ్గింది. 2021లో 1000కి 7.52శాతం తగ్గినట్లు ఆ దేశ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ చెబుతున్నాయి

Published : 18 Jan 2022 01:47 IST

బీజింగ్‌ : చైనాలో బర్త్‌ రేట్‌ (జననాల రేటు) గణనీయంగా తగ్గింది. 2021లో 1000కి 7.52 శాతం తగ్గినట్లు ఆ దేశ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ చెబుతున్నాయి. గతేడాదే చైనా ప్రధాన భూభాగంలో జననాల రేటు గణనీయంగా తగ్గినట్లు లెక్కల్లో తేలింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతులు మంజూరు చేసింది.

జనాభా తగ్గితే.. ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉంటుందని 2016లోనే చైనా గుర్తించింది. దీంతో అదే ఏడాది గతంలో ఉన్న ‘వన్‌ చైల్డ్‌ పాలసీ’కి ముగింపు పలికింది. ఈ స్థానంలో ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చింది. కానీ, చైనా పట్టణ ప్రాంతాల్లో వ్యయాలు భారీగా ఉండటంతో ప్రజలు రెండో బిడ్డను కనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పరిస్థితి మరింత చేజారక ముందే ముగ్గురు పిల్లల్ని కనేందుకు అవకాశం కల్పిస్తూ గతేడాది ఆదేశాలు జారీ చేసింది. చైనాలో 2021లో 10.62 మిలియన్ల మంది పిల్లలు జన్మించగా, 2020లో ఈ సంఖ్య 12 మిలియన్లుగా ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని