Shopping: రూ.లక్షన్నరతో రెండేళ్ల పిల్లాడి షాపింగ్
వీడియో గేమ్స్ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్‌ఫోన్ తీసుకున్న రెండేళ్ల బాలుడు.. పొరపాటున 1700 డాలర్లు(సుమారు లక్షా 27వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ప్రమోద్ కుమార్-మధు.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే న్యూజెర్సీలో సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని మధు అనుకున్నారు. వాల్‌మార్ట్ యాప్‌లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. కొన్నింటిని కార్ట్‌లో యాడ్
వీడియో గేమ్స్ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్‌ఫోన్ తీసుకున్న రెండేళ్ల బాలుడు.. పొరపాటున 1700 డాలర్లు(సుమారు లక్షా 27వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ప్రమోద్ కుమార్-మధు.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే న్యూజెర్సీలో సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని మధు అనుకున్నారు. వాల్‌మార్ట్ యాప్‌లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. కొన్నింటిని కార్ట్‌లో యాడ్ చేశారు. నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకున్నారు. అనూహ్యంగా వాల్‌మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఏంటా అని యాప్ చూసిన ప్రమోద్-మధుకు అసలు విషయం బోధపడింది. ఇదంతా తమ కుమారుడైన అయాన్ష్ చేసిన పనేనని అర్థమైంది. ‘‘అయాన్ష్ యాప్ ఓపెన్ చేశాడు. కార్ట్‌లో యాడ్ చేసి ఉన్నవాటన్నింటినీ ఆర్డర్ చేశాడు. పేమెంట్స్ అన్నీ పూర్తయిపోయాయి’’ అని ప్రమోద్ తెలిపారు. అయాన్ష్ వల్ల పొరపాటు జరిగిందంటూ ఆ దంపతులు వాల్‌మార్ట్‌ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..