omicron: మూడో డోసు తర్వాత నాలుగు నెలలు యాంటీబాడీలు..!

కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు తీసుకొన్న వారిలో వైరస్‌ను అడ్డుకోగల యాంటీబాడీలు నాలుగు నెలలపాటు స్థిరంగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలో

Updated : 10 Aug 2022 11:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు తీసుకొన్న వారిలో వైరస్‌ను అడ్డుకోగల యాంటీబాడీలు నాలుగు నెలలపాటు స్థిరంగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా బూస్టర్‌ డోసు తీసుకొన్న వారిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ పరిశోధన ఫలితాలను ఇంకా పీర్‌ రివ్యూ చేయలేదు. ఇప్పటికైతే నాలుగో షాట్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 

టెక్సాస్‌ యూనివర్శిటీ వైద్య విభాగానికి చెందిన పెయ్‌ యాంగ్‌ షీ.. టీకాలు తీసుకొన్న వారి రక్త నమూనాలను పరీక్షించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇది పూర్తిగా కొత్త. బూస్టర్‌ డోస్‌ తీసుకొన్న వారిలో దాదాపు మూడు నెలల పాటు యాంటీబాడీలు ఉంటున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇవి గణనీయంగా అడ్డుకొంటున్నాయి’’ అని వెల్లడించారు. 

బోస్టన్‌లోని బ్రీగమ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పటల్‌లోని ఇమ్యూనాలజిస్టు డువాన్‌ ఆర్‌ వెస్మన్‌ మాట్లాడుతూ..‘‘సాధారణ వ్యాక్సిన్‌నేషన్‌ అయ్యాక నెల రోజులకు పరీక్షలు చేయించుకోండి. మీ శరీరంలో యాంటీబాడీలు ఒమిక్రాన్‌పై పనిచేసే స్థితిలో ఉండవు’’ అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో డోసు టీకా ఇమ్యూన్‌ రక్షణ వ్యవస్థను పునరుత్తేజ పరుస్తుందన్నారు. కానీ మూడో డోసు తర్వాత వచ్చే యాంటీబాడీలు నాలుగు నెలల తర్వాత తగ్గుతాయా.. లేదా ఒక స్థాయికి వచ్చి స్థిరపడతాయా అనే విషయంపై స్పష్టత రాలేదు.  

ఇప్పటి వరకు రెండు డోసులు తీసుకొన్న వారిలో కూడా యాంటీబాడీలు వేగంగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. కొందరిలో నెల రోజుల తర్వాతే ఇవి శరీరంలో తగ్గిపోతున్నాయి. పైగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ యాంటీబాడీలను ఏమార్చి శరీరంలోకి ప్రవేశిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని