North Korea: మరోమారు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు..!
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టి మరోమారు ఉద్రిక్తతలు రాజేసింది. రెండు బాలిస్టిక్ మిసైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్టు
సియోల్: ఉత్తర కొరియా మరోమారు క్షిపణి ప్రయోగాలు చేపట్టి ఉద్రిక్తతలు రాజేసింది. రెండు బాలిస్టిక్ మిసైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్టు దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఇది జనవరి నెలలో జరిపిన ఆరో ప్రయోగమని వారు తెలిపారు. గురువారం స్వల్ప శ్రేణి క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించినట్లు చెప్పారు. కొన్ని నెలలుగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. ఈ నెల ప్రారంభంలో హైపర్ సోనిక్ మిసైల్ పరీక్షలు నిర్వహించిన కిమ్.. ఆ తర్వాత రైలు నుంచి క్షిపణులను ప్రయోగించారు. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు చేపట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ దేశాన్ని.. అమెరికా ద్వేషభావంతో చూస్తోందని, ఈ నేపథ్యంలో అణు పరీక్షలు ముమ్మరం చేసేందుకు నిర్ణయించుకున్నట్టు ఉత్తర కొరియా ఇటీవల ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM