Corona virus: వారంలో రెండు కోట్ల మందికి కరోనా..!

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. గత వారం (డిసెంబర్ 17-23) ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల( 2.1 కోట్లు)కు పైగా కొత్త కేసులొచ్చాయి.

Published : 27 Jan 2022 01:31 IST

వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. గత వారం (జనవరి 17-23) ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల( 2.1 కోట్లు)కు పైగా కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించింది. వారం వ్యవధిలో ఈ స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూడటం.. మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి ఇదే మొదటిసారి. ప్రతివారం ఇచ్చే నివేదికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గణాంకాలు వెల్లడించింది.

ఇక అదే వారంలో దాదాపు 50 వేల మరణాలు నమోదయ్యాయి. జనవరి 23 వరకు 34 కోట్లకు పైగా కేసులు.. 55 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని పేర్కొంది. ఈ రెండు కోట్ల కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్, భారత్, ఇటలీ, బ్రెజిల్‌ దేశాల వాటానే ఎక్కువగా ఉందని పేర్కొంది. మరణాల పరంగా అమెరికా, రష్యా, భారత్‌, ఇటలీ, యూకే ముందున్నాయి. 

అంతర్జాతీయంగా ఒమిక్రాన్ డామినెంట్‌ వేరియంట్‌గా మారుతోందని ఆరోగ్య సంస్థ తెలిపింది. అనేక దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ సమూహ వ్యాప్తిని నివేదిస్తున్నాయని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా నవంబర్, డిసెంబర్‌లో భారీ స్థాయిలో కేసులు చవిచూసిన దేశాల్లో ఇప్పుడు తగ్గుదల ప్రారంభమైందని తెలిపింది. ఒమిక్రాన్ వెలుగుచూసిన తర్వాత ఐరోపా దేశాల్లో దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. అగ్రదేశం అమెరికా వణికిపోయింది. ఇప్పుడిప్పుడే అవి కాస్త కోలుకుంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని