పుర్రెలా కనిపించాలని చెవులు కత్తిరించుకున్నాడు

వార్తలు / కథనాలు

పుర్రెలా కనిపించాలని చెవులు కత్తిరించుకున్నాడు

ఇంటర్నెట్‌ డెస్క్: శరీరం మొత్తం టాటూలు వేసుకోవడం.. విభిన్నంగా ఉండాలనో.. మరింత అందంగా కనిపించాలనో అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకోవడం విదేశాల్లో సర్వసాధారణమే కానీ.. పైన కనిపిస్తున్న వ్యక్తి చేసిన పని మాత్రం ఎవరూ చేయలేరు.. చేయడానికి సహసించరనే చెప్పాలి. ఏం చేశాడంటారా..! తన ముఖం పుర్రెలా కనిపించాలని ఏకంగా తన చెవులను తొలగించుకున్నాడు మరి. 

టాటూలు వేయించుకోవడం.. సర్జరీలకు చేయించుకోవడం వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొందరు నమ్ముతారు. అలాంటి వ్యక్తే జర్మనీకి చెందిన 39 ఏళ్ల సాండ్రో. గత కొన్నాళ్లుగా సాండ్రో తన శరీరంపై అనేక చోట్ల టాటూలు వేయించుకున్నాడు. అయితే కొన్నాళ్ల కిందట అతడి ముఖాన్ని పుర్రెలా మార్చుకోవాలనుకున్నాడట. ఈ క్రమంలో చెంపలపై పుర్రె దవడల్లా టాటూలు వేయించుకున్నాడు. కరోనా రాకముందు రూ. 5లక్షల వరకు ఖర్చు చేసి తన రెండు చెవులను తొలగించుకున్నాడు. వాటిని ఓ జార్‌లో భద్రపర్చి ఇంట్లో పెట్టుకున్నాడు.

ప్రస్తుతం చెవులు లేకుండా సాండ్రో ముఖం కాస్త భయంకరంగా ఉన్నా.. సోషల్‌మీడియాలో అతడి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు తనని విచిత్ర వ్యాధితో బాధపడుతున్న వాడిలా భావిస్తున్నా అవన్నీ పట్టించుకోనని అంటున్నాడు. తన ముఖాన్ని చూస్తే తనకు ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉంటుందని, మరో శస్త్రచికిత్స చేయించుకొని ముక్కును కూడా తొలగించుకుంటానని వెల్లడించాడు. పుర్రెలా కనిపించడం కోసం ఏదైనా చేస్తానని అంటున్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న