వాటర్‌ ట్యాంక్‌ టవర్‌ను ఇంటిగా మార్చేశారు!

వార్తలు / కథనాలు

వాటర్‌ ట్యాంక్‌ టవర్‌ను ఇంటిగా మార్చేశారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఇల్లు నిర్మిస్తే.. ఇంటిపై వాటర్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ, నెదర్లాండ్స్‌లోని ఇద్దరు సోదరులు వాటర్‌ ట్యాంక్‌ టవర్‌నే ఇల్లుగా మార్చి అందరినీ ఆశ్చర్యపర్చారు. అంతేకాదు.. వాటర్‌ ట్యాంక్‌ టవర్‌ను చక్కటి ప్రణాళికతో అబ్బురపరిచే ఇంటిగా మార్చినందుకు గానూ గతేడాది వాటర్‌ టవర్‌ అవార్డును సైతం అందుకున్నారు.

న్యూలెక్కర్‌లాండ్‌కు చెందిన స్వెన్‌, లెన్నర్ట్‌ డి జోంగ్‌ చిన్నతనంలో నివసించిన ఇంటి పక్కనే 36.90 మీటర్ల ఎత్తతో ఒక పెద్ద వాటర్‌ ట్యాంక్‌ టవర్‌ ఉండేది. దాని కింద వీరిద్దరు చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నారు. కానీ, కొన్నాళ్ల తర్వాత అదే టవర్‌ వారి కలల సౌధమవుతుందని ఊహించి ఉండరు. స్వెన్‌ సోదరుల ఇంటి పక్కన ఉన్న వాటర్‌ ట్యాంక్‌ టవర్‌ 1915 నుంచి నిరుపయోకరంగా ఉండటంతో దాన్ని 2011లో వేలంలో అమ్మేయాలని స్థలం యజమాని నిర్ణయించారు. అదే సమయంలో స్వెన్‌, లెన్నర్ట్‌ ఉద్యోగాల్లో స్థిరపడి బాగానే సంపాదిస్తున్నారు. దీంతో వేలంలో పెట్టిన స్థలాన్ని, వాటర్‌ టవర్‌ను 2,45,000డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. అప్పటికి వారిద్దరికి ఇంకా వివాహం కాలేదు.

కొనుగోలు చేసిన వాటర్‌ ట్యాంక్‌ను ఇల్లుగా మార్చాలని స్వెన్‌, లెన్నర్ట్‌ పనులు మొదలుపెట్టారు. వివాహామైన తర్వాత వీరి భార్యలు సైతం ఇంటి నిర్మాణానికి మద్దతు పలకడంతో రెండు కుటుంబాలకు సరిపడే విధంగా ఆరు మీటర్ల ఎత్తు చొప్పున రెండు అంతస్తులుగా వాటర్‌ ట్యాంక్‌ టవర్‌ను ఇంటిగా పునఃనిర్మించారు. పడకగదులు, వంటగది, బాల్కానీ ఇలా అన్ని వసతులు ఉండేలా చూసుకున్నారు. పైన వాటర్‌ ట్యాంక్‌ను అలాగే ఉంచారు. త్వరలో ఈ ఇంట్లో నివసించేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న