ఈజిప్ట్‌కు కొత్త రాజధాని

వార్తలు / కథనాలు

ఈజిప్ట్‌కు కొత్త రాజధాని

ఈజిప్ట్‌ కొత్త రాజధానిని నిర్మించనుంది. ప్రస్తుత రాజధాని కైరోకు తూర్పుగా 35 కి.మీ. దూరంలో నిర్మించనున్న ఈ నగరానికి న్యూకైరో అని పేరుపెట్టారు. ప్రస్తుత నగరం కిక్కిరిసిపోవడంతో కొత్త నగరానికి శ్రీకారం చుట్టారు. 2015లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా సిసి నూతన రాజధానిని నిర్మించాలని ఆదేశించారు. తొలిదశలో భాగంగా 168 చ.కి.మీ విస్తీర్ణంలో నగరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి నిర్మాణాలు చేపట్టే అవకాశముంది.

6.5 మిలియన్లమంది ఆవాసం
కొత్త నగరంలో 6.5 మిలియన్ల మంది ప్రజలు నివాసానికి అనువుగా గృహ నిర్మాణంతో పాటు వసతులు కల్పిస్తారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా స్మార్ట్‌ ట్రాఫిక్‌ విధానంలో భాగంగా రహదారుల నిర్మాణం జరగనుంది. విద్యుత్‌ సరఫరా, గ్యాస్.. తదితర సరఫరాలు ఏఐ టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది.

నగరమంతా మూడో నేత్రం
నగరంలో వేల సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు తెలిసిపోతుంది. ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. 

మరి కొన్ని విశేషాలు..
* 21 సెక్టార్లుగా నగరం విభజన
* నగరంలో 650 కి.మీ. రోడ్లు
* అంతర్జాతీయ విమానాశ్రయం

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న