close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మెడలో ఆభరణమైన కరోనా వైరస్‌

కరోనా వైరస్‌.. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే.. రష్యాలోని ఓ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని ఆభరణంగా మార్చేసింది. ఆమె చేసిన ఆభరణానికి ఎంత ఆదరణ లభిస్తుందో.. విమర్శల వర్షం కూడా అంతే ఉంది.

రష్యాకి చెందిన డాక్టర్‌ వొరొబెవ్‌.. ఓ ‘మెడికల్‌ జ్యువెలరీ ’నగల వ్యాపారి. మెడికల్‌ జ్యువెలరీ అంటే.. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్‌ జ్యువెలరీని ధరిస్తున్నారు. అయితే ఇటీవల చైనాలో పుట్టిన కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసిన వైద్య శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దాని రూపాన్ని కనిపెట్టారు. గుండ్రంగా ఉండే ఈ వైరస్‌ చుట్టు కొమ్ములు ఉండి.. చివరన కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. ఈ వైరస్‌ ఆకారం ఎలా ఉంటుందో ప్రకటించగానే డాక్టర్‌ వొరొబెవ్‌ వైరస్‌ ఆకృతితో వెండి పెండెంట్స్‌ తయారు చేయడం ప్రారంభించారు. 13 డాలర్లకు ఒక పెండెంట్‌ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. కొత్తగా ఉండే దేనినైనా స్వాగతించే యువత.. వీటిని కూడా కొనుగోలు చేసి ధరిస్తున్నారు. అంతేకాదు.. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. అయితే మరికొంత మంది ఈ పెండెంట్‌ తయారీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే.. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుంటే.. వైరస్‌తో వ్యాపారం చేస్తావా? అని వొరొబెవ్‌ను విమర్శిస్తున్నారు.

కాగా.. పెండెంట్‌ తయారు చేస్తున్న వొరొబెవ్‌ మాత్రం తనను తాను సమర్థించుకుంటోంది. తాను తయారు చేస్తున్నది మెడికల్‌ జ్యువెలరీ అని.. వైద్య సిబ్బంది మంచి కోసమే తాను వీటిని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్‌ నిలుస్తుందని వొరొబెవ్‌ అంటున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్న చాలా మంది.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు ఈ పెండెంట్‌ను కానుకగా ఇస్తున్నారని తెలిపారు. ఆమె.. కేవలం కరోనా వైరస్‌దే కాదు.. బ్యాక్టీరియా, డీఎన్‌ఏ, గుండె తదితర ఆకృతులతో పెండెంట్‌లు తయారు చేస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు