ఆ దేశాలతో అందరికీ కన్ఫ్యూజనే!

వార్తలు / కథనాలు

ఆ దేశాలతో అందరికీ కన్ఫ్యూజనే!

మనిషిని పోలిన మనిషిని చూసి పొరపాటు పడటం చూశాం.. కానీ ఒక దేశం అనుకొని మరో దేశానికి ఉత్తరాలు పంపడం ఎప్పుడైనా విన్నారా? స్లొవేనియా.. స్లొవాకియా మధ్య నిత్యం జరిగే విచిత్రమిది. చాలామంది వారు రాసే ఉత్తరాల చిరునామాలో ఒక దేశం బదులు మరో దేశం పేరు రాస్తారట. రెండు దేశాల పేర్లు పలకడానికి.. చూడటానికి ఒకేలా ఉంటాయి. అందుకే ఈ పొరపాటు సహజంగానే ఎక్కువగా జరుగుతుంటోంది. దీంతో ప్రతి నెలలో ఒక రోజు స్లొవేనియా, స్లొవాకియా దేశాలకు చెందిన అధికారులు తమ తమ రాయబార కార్యాలయంలో కలుసుకొని ఉత్తరాలు మార్చుకుంటారట. ఆ రెండు దేశాల పేర్లే కాదు.. చాలా విషయాల్లో సారూప్యత ఉండటం విశేషం.. అవేంటో మీరే చూడండి.

* స్లొవేనియా.. స్లొవాకియా రెండు దేశాలు రిప్లబిక్‌ దేశాలే. దీంతో స్లొవేనియాను రిపబ్లికా స్లొవెనిజా అని.. స్లొవాకియాను స్లొవెన్స్‌కా రిపబ్లికా అని పిలుస్తారు.

* రెండు దేశాల మాతృ భాషలు వేరైనా.. స్లావిక్‌‌ నుంచి పుట్టుకొచ్చినవే. స్లొవాకియా భాష స్లొవక్‌ కాగా.. స్లొవేనియా భాష స్లోవెన్‌.

* ఇరు దేశాలు పక్కపక్కన ఉండవు కానీ.. ఆస్ట్రియా, హంగేరీ దేశాలతో సరిహద్దులు పంచుకుంటాయి.

* దేశాల జాతీయ జెండాలు కూడా ఒకేలా ఉంటాయి. సాధారణంగానే స్లావిక్‌ దేశాల జాతీయజెండాల్లో ఎరుపు రంగు సహజంగా ఉంటుంది. కానీ స్లొవేనియా... స్లొవాకియా దేశాల జెండాల్లో చాలా సారూప్యత ఉంటుంది. స్లొవాకియా పతాకంలో శిలువ గుర్తు లాంటి ఆకారం ఉండగా... స్లొవేనియా జెండాలో మంచు కొండలు లాంటి చిత్రం ఉంటుంది. 

* రెండు దేశాలు పోరాటంతోనే స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాయి. యుగోస్లవేనియా పాలన నుంచి 1991లో స్లొవేనియా విముక్తి పొంది స్వరాజ్యం స్థాపించుకుంది. చెకోస్లొవాకియా నుంచి 1992లో స్లొవాకియా వేరుపడింది. దీంతో చెక్‌ రిపబ్లిక్‌.. స్లొవాకియా దేశాలుగా ఏర్పడ్డాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న