అదృష్టం అంటే అతడిదే.. ఒకేసారి 20 లాటరీలు!

వార్తలు / కథనాలు

అదృష్టం అంటే అతడిదే.. ఒకేసారి 20 లాటరీలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. రోజూ లాటరీలు కొంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తిపై అదృష్టం వర్షం కురిపించినట్లు ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి కొన్న లాటరీ టికెట్లన్నింటికి నగదు బహుమతి వచ్చింది.

ఇటీవల టోనీ మైల్స్‌ అనే వ్యక్తి 20 వర్జీనియా లాటరీ టికెట్లను కొన్నాడట. నాలుగు రోజుల తర్వాత లాటరీ అధికారులు వెల్లడించిన 1-9-2-9 నంబర్ల కాంబినేషన్‌ అతడు కొన్న 20 టికెట్లలో ఉండటంతో ఒక్కో టికెట్‌కు 5వేల డాలర్లు(దాదాపు రూ. 3.66లక్షలు) నగదు బహుమతి లభించింది. అంటే మొత్తంగా లక్ష డాలర్లు (దాదాపు రూ. 73.24లక్షలు)గెలుచుకున్నాడు. ఒకేసారి ఇన్ని లాటరీలు గెలవడంతో సంతోషపడ్డ టోనీ.. ఈ నగదుతో మొదట తనకు ఉన్న అప్పులు తీర్చేస్తానని తెలిపాడు. నగదు బహుమతి చిన్నమొత్తమే అయినా కొన్న అన్ని టికెట్లు గెలవడం ఆశ్చర్యపోయే విషయమే కదా..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న